Venezuela Oil Reserves | ప్రపంచ చమురు నిధి వెనిజులా: అపారమైన నిల్వలు ఉన్నా తప్పని సవాళ్లు
ప్రపంచంలోనే అత్యధికంగా 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నప్పటికీ, ఆంక్షలు, మౌలిక సదుపాయాల కొరత వల్ల వెనిజులా చమురు ఉత్పత్తి పడిపోయింది. ఈ చమురు నిల్వలు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఏ విధంగా కీలకంగా మారాయో చూద్దాం.
International | Published On Jan 11, 2026, 4.39 pm IST
సంక్షిప్త సారాంశం
ప్రపంచంలోనే అత్యధికంగా 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు కలిగిన వెనిజులా, ప్రస్తుతం తీవ్రమైన ఉత్పత్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆంక్షలు, పెట్టుబడుల కొరత కారణంగా ఉత్పత్తి పడిపోయినప్పటికీ, ఆ దేశం వద్ద ఉన్న నిల్వలు ప్రపంచ ఇంధన భద్రతలో అత్యంత కీలకంగా మారాయి. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల మధ్య ఈ చమురు నిల్వలపై పట్టు కోసం రాజకీయ పోరాటం సాగుతోంది.
Venezuela Oil Reserves | ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశంగా వెనిజులాకు రికార్డు ఉంది. అయినా కూడా ఆ దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. యూఎస్ వల్ల వెనిజులా చమురు నిల్వలు అలాగే ఉండిపోయాయి. చమురు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవాల్సిన చమురు ఉన్నా, రాజకీయ, వాణిజ్య ఆంక్షల వల్ల ఆ దేశం ఇబ్బందుల్లో పడింది.
వెనిజులా వద్ద సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం నిల్వలతో పోల్చితే 17 శాతానికి సమానం.
భారీగా తగ్గిన ఉత్పత్తి
ఒకప్పుడు మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసిన వెనిజులా, నేడు అందులో కొంత భాగాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. దీనికి ప్రధాన కారణాలు మౌలిక సదుపాయాల కొరత, పరిపాలనా లోపాలు, నిర్వహణ లోపాలు, అంతర్జాతీయ ఆంక్షలు అని తెలుస్తోంది.
అమెరికా జోక్యం
చమురు సరఫరాపై పట్టు సాధించేందుకు, చైనా వంటి ప్రత్యర్థులను అడ్డుకునేందుకు, తమ ఇంధన భద్రతను బలోపేతం చేసుకునేందుకు అమెరికా ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల చమురు వాణిజ్య మార్గాలు మారిపోయి, చైనా వంటి దేశాలు ప్రధాన కొనుగోలుదారులుగా తెరపైకి వచ్చాయి. తన పవర్‌ని బలోపేతం చేసుకోవడానికి, లాటిన్ అమెరికాలో తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికా కూడా ఈ సరఫరాపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రపంచ దేశాల చమురు నిల్వలు (బిలియన్ బ్యారెళ్లలో):
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వద్ద ఉన్న చమురు నిల్వల వివరాలు కింది విధంగా ఉన్నాయి
దేశం - చమురు నిల్వలు (బిలియన్ బ్యారెల్స్)
వెనిజులా - 303
సౌదీ అరేబియా - 267
ఇరాన్ - 209
కెనడా - 163
ఇరాక్, -145
యూఏఈ - 113
కువైట్ - 102
రష్యా - 80
లిబియా - 48.4
యూఎస్(అమెరికా) - 45
నైజీరియా - 37
కజకిస్తాన్ - 30
చైనా - 28
ఖతర్ - 25
బ్రెజిల్ - 15.9
అల్జీరియా - 12.2
ఈక్వడార్ - 8.3
అంగోలా - 8
అజెర్బేజన్ - 7
మెక్సికో - 5.8
నార్వే - 5.4
ఈజిప్ట్ - 3.3
అర్జెంటినా - 3
మలేషియా - 2.7
కొలంబియా - 2
ఆస్ట్రేలియా - 1.8
యూకే - 1.5
బ్రునెయ్ - 1.1
డెన్మార్క్ - 0.4
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
- ●Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు
- ●India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు
- ●Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
- ●Konda Surekha | రేవంత్‌లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
- ●SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్

Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు

India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు

Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు




