త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Iran Talks | ఇరాన్ ముందు 5 కఠిన షరతులు పెట్టిన అమెరికా.. భగ్గుమంటున్న టెహ్రాన్

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు రసవత్తరంగా మారాయి. ఇరాన్ ముందు అమెరికా 5 కఠిన షరతులు ఉంచింది. యురేనియం అప్పగింతతో పాటు ఆ షరతులు ఇవే.

J

International | Published On May 17, 2026, 6.41 pm IST

US Iran Talks | ఇరాన్ ముందు 5 కఠిన షరతులు పెట్టిన అమెరికా.. భగ్గుమంటున్న టెహ్రాన్
Advertisement

US Iran Talks | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ అమెరికా (US), ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో అమెరికా ఒక అడుగు ముందుకేసి ఇరాన్ ముందు ఐదు కఠినమైన షరతులను ఉంచినట్లు సమాచారం. 400 కిలోల ఎన్‌రిచ్డ్ యురేనియంను (Enriched Uranium) అప్పగించడంతో పాటు పలు కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ఇరాన్ న్యూస్ ఏజెన్సీల రిపోర్టుల ప్రకారం ఆ షరతులు ఇవే.

అమెరికా పెట్టిన 5 షరతులు ఇవే

పరిహారం కట్: గత ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల ఇరాన్‌కు జరిగిన నష్టానికి ఎలాంటి పరిహారం ఇచ్చేది లేదని అమెరికా తేల్చి చెప్పింది.

యురేనియం అప్పగింత: ఈ చర్చల్లో భాగంగా ఇరాన్ తన దగ్గరున్న 400 కిలోల ఎన్‌రిచ్డ్ యురేనియంను అమెరికాకు అప్పగించాలి.

ఒకే ఒక్క న్యూక్లియర్ ప్లాంట్: ఇరాన్‌లో కేవలం ఒకే ఒక్క న్యూక్లియర్ ఫెసిలిటీ (Nuclear Facility) మాత్రమే ఆపరేషన్‌లో ఉండాలి.

నిధులు వాపస్ ఇవ్వం: విదేశాల్లో ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల్లో (Frozen assets) కనీసం 25 శాతాన్ని కూడా తిరిగి ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది.

యుద్ధాలు ఆగాల్సిందే: వివిధ ఫ్రంట్‌లలో జరుగుతున్న పోరాటాలను ఆపితేనే చర్చలు ముందుకు సాగుతాయని స్పష్టం చేసింది. అయితే, ఈ షరతులు పాటించినా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయవన్న గ్యారెంటీ లేదని వైనెట్‌న్యూస్ (Ynetnews) పేర్కొంది.

ఇరాన్ కౌంటర్ డిమాండ్స్ (Iran's Counter Demands)

అమెరికా తీరుపై ఇరాన్ మీడియా మండిపడింది. తమ డిమాండ్లకు అమెరికా ఎలాంటి సానుకూల స్పందన ఇవ్వలేదని, కేవలం వారు లబ్ధి పొందేందుకే చూస్తున్నారని ఆరోపించింది. దీనికి కౌంటర్‌గా ఇరాన్ కూడా ఐదు "కాన్ఫిడెన్స్-బిల్డింగ్" షరతులను ముందుంచింది.

  • లెబనాన్ సహా అన్ని ఫ్రంట్‌లలో యుద్ధాలను తక్షణమే ఆపాలి.
  • ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలి.
  • ఫ్రీజ్ చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలి.
  • యుద్ధ నష్టాలకు తగిన పరిహారం చెల్లించాలి.
  • గ్లోబల్ ఆయిల్ రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) పై ఇరాన్ సార్వభౌమత్వాన్ని గుర్తించాలి.

శాంతి పేరుతో నాటకాలు

చర్చల పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ నాటకాలు ఆడుతున్నాయని ఇరాన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి ఇస్మాయిల్ బఘై (Esmail Baqaei) 'ఎక్స్' వేదికగా విమర్శించారు. దౌత్యం ముసుగులో వారు సైనిక లక్ష్యాలను చేరుకోవాలని చూస్తున్నారని, సంక్షోభాన్ని సృష్టించి శాంతి పేరుతో మళ్లీ దాడులకు పాల్పడటం వారి వ్యూహమని మండిపడ్డారు. మళ్లీ సైనిక దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది.

భారీ మూల్యం తప్పదు: ఇరాన్ వార్నింగ్

ఇటీవల ఇరాన్ ప్రతిపాదించిన 14-పాయింట్ల శాంతి ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనను అంగీకరించకపోతే అమెరికా పన్ను చెల్లింపుదారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేయడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఆ తర్వాత ఏప్రిల్ 8న పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ (Ceasefire) కుదిరినప్పటికీ, శాశ్వత శాంతి ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

Advertisement
Advertisement