Instagram Romance | అతనికి 17.. ఆమెకు 21.. ఇన్‌స్టాలో పరిచయమయ్యారు.. ఇంట్లో చెప్పకుండా..
Instagram romance | అతడు మైనర్. ఆమెకు 21 ఏండ్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram romance) పరిచయమయ్యారు. వ్యవగత వివరాలు షేర్ చేసుకున్నారు. ఒక్కటవుదామని అనుకున్నారు. ఇంకేముంది ఇంట్లో చెప్పకుండా ఉడాయించారు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకున్నది.
Instagram Romance | త్రినేత్ర.న్యూస్: అతడు మైనర్. ఆమెకు 21 ఏండ్లు. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram Romance) పరిచయమయ్యారు. వ్యవగత వివరాలు షేర్ చేసుకున్నారు. ఒక్కటవుదామని అనుకున్నారు. ఇంకేముంది ఇంట్లో చెప్పకుండా ఉడాయించారు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకున్నది.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా వీర్పూర్‌కు చెందిన రాజ్. అతనికి ప్రస్తుతం 17 ఏండ్లు మాత్రమే. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనా అనే 21 ఏండ్ల యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. ఇద్దరూ తరచూ చాట్‌చేసుకునేవారు. వ్యక్తి గతవిషయాలను షేర్ చేసుకున్నారు. అలా రోజులు గడిచే కొద్దీ అది మరింత చనువుగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం అమ్మాయి ఇంట్లో తెలుసిపోయింది.
దీంతో ఆమెకు పెండ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె మార్చి 6న తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ముంబైకి చేరుకున్న ఆ యువతి.. రాజ్‌తో కలిసి సూరత్ చేరుంది. రాత్రి సమయంలో సూరత్ రైల్వే స్టేషన్‌లో (Surat railway station) ఉన్న వెయిటింగ్ రూమ్‌లో ఉన్నారు. వారిని చూసిన రైల్వే షీటీమ్ పోలీసులు.. ఇరువురి ప్రవర్తనపై అనుమానం రావడంతో ప్రశ్నించారు.
మరోవైపు బాలుడు కనిపించకుండా పోవడంతో అతని తల్లిదండ్రులు రాజ్‌కోట్‌లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో బాలుడి వివరాలను చెక్ చేసిన రైల్వే పోలీసులు.. మిస్సింగ్ కేసు గురించి తెలుసుకున్నారు. దీంతో రాజ్‌కోట్ పోలీసులను సంప్రదించారు. వారు హుటాహుటిన సూరత్ చేరుకుని వారిద్దరిని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలుడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ యువతిపై కిడ్నాప్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్






