Polytechnic Students | హోంవర్క్ చేయలేదని.. పాలిటెక్నిక్ విద్యార్థులను కేబుల్ వైర్లతో కొట్టిన HOD
Polytechnic Students | వాళ్లేమీ చిన్న పిల్లలు కాదు. డొప్పొమా కోర్సు చేస్తున్నారు. హోం వర్క్ (Home Work) చేయలేదని స్కూళ్లో పిల్లలను దండించినట్లు.. పాలిటెక్నిక్ చదువుతున్న స్టూడెంట్స్‌ను (Polytechnic Students) వైరుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.
Polytechnic Students | త్రినేత్ర.న్యూస్: వాళ్లేమీ చిన్న పిల్లలు కాదు. డొప్పొమా కోర్సు చేస్తున్నారు. హోం వర్క్ (Home Work) చేయలేదని స్కూళ్లో పిల్లలను దండించినట్లు.. పాలిటెక్నిక్ చదువుతున్న స్టూడెంట్స్‌ను (Polytechnic Students) వైరుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. దీంతో వారి కాళ్లపై చర్మం చిట్లిపోవడంతో రక్తం కారిన.. ఈ దారుణ ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లా రత్నపురి ఇన్‌స్టిట్యూట్‌లో చోటుచేసుకున్నది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ శివారులో ఉన్న రత్నపురి ఇన్‌స్టిట్యూట్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు హోంవర్క్ చేయలేదని.. 15 మంది విద్యార్థులపై HOD శివారెడ్డి కేబుల్ వైర్లతో దాడి చేశాడు. విచక్షణ రహితంగా కొట్టడంతో పలువురు విద్యార్థుల కాళ్లపై వాతలు వచ్చాయి. కొందరికి రక్తం కారింది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తమను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలియడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఓడీ శివారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా యాజమాన్యం చూసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్



