త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | ట్రంప్‌కి మతిస్థిమితం లేదన్న ఇరాన్.. హార్ముజ్‌లో చిక్కుకున్న 16 భారత నౌకలు

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల మధ్య 16 భారతీయ వాణిజ్య నౌకలు జలసంధిలో చిక్కుకుపోగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి చెందారు.

J

International | Published On Apr 6, 2026, 4.12 pm IST

US-Israel-Iran War | ట్రంప్‌కి మతిస్థిమితం లేదన్న ఇరాన్.. హార్ముజ్‌లో చిక్కుకున్న 16 భారత నౌకలు
Advertisement
  • Day 38
  • ట్రంప్ హెచ్చరికను లైట్ తీసుకున్న ఇరాన్
  • ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం
  • 45 రోజుల పాటు కాల్పుల విరమణ కోసం చర్చలు
  • తీవ్రరూపం దాల్చిన ఇరాన్-అమెరికా వార్

US-Israel-Iran War | త్రినేత్ర.న్యూస్ : మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సంక్షోభం మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ట్రంప్ సీరియస్ వార్నింగ్ - 'పవర్ ప్లాంట్, బ్రిడ్జి డే'

మంగళవారం సాయంత్రంలోగా హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై విరుచుకుపడతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఆయన స్పందిస్తూ.. "మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జి డే కాబోతోంది. జలసంధిని తెరవకపోతే ఇరాన్ నరకం చూస్తుంది" అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీనిపై ఇరాన్ సాంస్కృతిక మంత్రి స్పందిస్తూ, ట్రంప్ "మతిస్థిమితం లేని వ్యక్తి" అని కొట్టిపారేశారు. శత్రువుల కోసం జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

హతం అయిన ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్

అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సోమవారం తెల్లవారుజామున చేసిన దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజిద్ ఖదేమీ మృతి చెందారు. ఐదేళ్లుగా ఆయన ఈ పదవిలో ఉన్నారు. మరోవైపు ఇరాన్ వ్యాప్తంగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో టెహ్రాన్ సహా పలు ప్రావిన్సులలో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారు.

US-Iran War Escalates Trump Threatens Attacks 16 Indian Ships Stranded in Hormuz IRGC Intel Chief Killed

చిక్కుకున్న 16 భారతీయ నౌకలు - రంగంలోకి ఇండియన్ నేవీ

యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో 16 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకుపోయినట్లు రాయిటర్స్ తెలిపింది. వీటిలో ఎల్‌పీజీ గ్యాస్ తీసుకొస్తున్న నౌకలు కూడా న్నాయి.

ఆపరేషన్ ఊర్జా సురక్ష: భారతదేశ ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇండియన్ నేవీ 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'ను చేపట్టింది.

నావికాదళం ఇప్పటికే 'గ్రీన్ ఆశా', 'గ్రీన్ సాన్వి' వంటి నౌకలను సురక్షితంగా జలసంధి దాటించి గుజరాత్ తీరానికి చేర్చింది. ప్రస్తుతం 'జగ్ విక్రమ్' అనే మరో భారీ ఎల్‌పీజీ నౌక భద్రతా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోంది.

US-Iran War Escalates Trump Threatens Attacks 16 Indian Ships Stranded in Hormuz IRGC Intel Chief Killed

గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు - అణు కేంద్రంపై ఆందోళన

అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4 కింద దాడులు చేస్తోంది. కువైట్‌లోని బూబియన్ ద్వీపంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, బహ్రెయిన్ లోని చమురు కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. యూఏఈలోని ఫుజైరాలో టెలికాం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా, యూఏఈ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. అబుదాబిలో పడిన శకలాల వల్ల ఒక ఘనా జాతీయుడు గాయపడ్డాడు.

బుషెర్ న్యూక్లియర్ ప్లాంట్

ఇరాన్‌లోని బుషెర్ అణు విద్యుత్ కేంద్రానికి కేవలం 350 మీటర్ల దూరంలో క్షిపణులు పడటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అణు కేంద్రం దెబ్బతింటే గల్ఫ్ దేశాల నీటి వనరులు పూర్తిగా కలుషితం అయ్యే ప్రమాదం ఉంది.

US-Iran War Escalates Trump Threatens Attacks 16 Indian Ships Stranded in Hormuz IRGC Intel Chief Killed

భగ్గుమంటున్న ఆయిల్ ధరలు - శాంతి యత్నాలు

హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బారెల్‌కు 110 డాలర్లకు పైగా పెరిగాయి. దీని ప్రభావంతో ఎయిర్ ఏషియా లాంటి విమానయాన సంస్థలు చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి. వియత్నాంలో ఇంధన ధరల పెరుగుదల గిగ్ వర్కర్ల జీవనోపాధిని దెబ్బతీసింది.

మరోవైపు, యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల శాంతి ఒప్పందాన్ని ఇరాన్ "అహేతుకమైనది"గా తిరస్కరించింది. అయితే, పాకిస్థాన్, ఈజిప్ట్, ఒమన్ దేశాల మధ్యవర్తిత్వంతో 45 రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేసేలా ఇరు దేశాల మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement