త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UAE Pakistan Airport Deal | పాకిస్థాన్‌కి యూఏఈ షాక్: పాక్ ఎయిర్‌పోర్ట్ డీల్ రద్దు.. భారత పర్యటన తర్వాత కీలక నిర్ణయం

యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక భారత పర్యటన తర్వాత పాకిస్థాన్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ ఒప్పందం నుంచి యూఏఈ తప్పుకుంది.

J

International | Published On Jan 26, 2026, 4.00 pm IST

UAE Pakistan Airport Deal | పాకిస్థాన్‌కి యూఏఈ షాక్: పాక్ ఎయిర్‌పోర్ట్ డీల్ రద్దు.. భారత పర్యటన తర్వాత కీలక నిర్ణయం

సంక్షిప్త సారాంశం

భారత్-యూఏఈ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్న తరుణంలో, పాకిస్థాన్‌తో ఉన్న కీలక విమానాశ్రయ ఒప్పందాన్ని అబుదాబీ రద్దు చేసుకుంది. 2025 ఆగస్టు నుంచి చర్చల్లో ఉన్న ఈ డీల్ నిలిచిపోవడం దక్షిణ ఆసియా భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పుగా కనిపిస్తోంది.

Advertisement

UAE Pakistan Airport Deal | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవల భారత్‌లో జరిపిన ఆకస్మిక పర్యటన (3 గంటలు) దక్షిణ ఆసియా భౌగోళిక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పర్యటన ముగిసిన కొన్ని రోజులకే, పాకిస్థాన్‌కు యూఏఈ గట్టి షాక్ ఇచ్చింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించేందుకు గత ఏడాది ఆగస్టు నుంచి జరుగుతున్న చర్చలను అబుదాబీ అకస్మాత్తుగా నిలిపివేసింది.

మారిపోయిన సమీకరణాలు

పాకిస్థానీ మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రాజెక్టుపై యూఏఈ ఆసక్తి కోల్పోవడమే కాకుండా, కార్యకలాపాల అవుట్‌సోర్సింగ్ కోసం స్థానిక భాగస్వామిని నియమించడంలో విఫలమైందని పేర్కొంది. అధికారికంగా రాజకీయ కారణాలు వెల్లడించకపోయినప్పటికీ, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

UAE Pulls Out of Pakistan Airport Deal After President’s Surprise India Visit

భారత్‌తో స్నేహం.. పాక్‌తో దూరం?

గత వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అయిన యూఏఈ అధ్యక్షుడు.. 900 మంది భారతీయ ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అలాగే భారత్-యూఏఈ మధ్య 'వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం' (Strategic Defence Partnership) దిశగా అడుగులు పడ్డాయి.

మరోవైపు, పాకిస్థాన్ తన సైనిక అవసరాల కోసం సౌదీ అరేబియాతో జట్టు కడుతుండగా, యూఏఈ మాత్రం భారత్‌తో రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. పాకిస్థాన్‌లోని ప్రభుత్వ సంస్థల నిర్వహణ లోపాలు, రాజకీయ జోక్యం వల్ల జరుగుతున్న నష్టాలు కూడా యూఏఈ వంటి దేశాలు పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గడానికి కారణమవుతున్నాయి.

విశ్వసనీయత కోల్పోతున్న పాక్

గతంలో పాకిస్థాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న యూఏఈ, ఇప్పుడు ఆ దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుండి తప్పుకోవడం పాక్ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బే. అఫ్గానిస్తాన్ వంటి కష్టతరమైన ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలను నిర్వహించిన అనుభవం ఉన్న యూఏఈ, ఇస్లామాబాద్ విషయంలో వెనక్కి తగ్గడం పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా తగ్గుతున్న విశ్వసనీయతకు నిదర్శనంగా కనిపిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement