Osman Hadi murder | బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు హాదీని చంపి మేఘాలయ మీదుగా భారత్‌కి పారిపోయారు
పుర్టి అనే వ్యక్తి వీళ్లను హలువాఘాట్ బోర్డర్ వద్ద రిసీవ్ చేసుకున్నాడు. సామీ అనే టాక్సీ డ్రైవర్ వాళ్లను మేఘాలయాలో ఉన్న టురా సిటీకి పంపించాడు అని అడిషనల్ కమిషనర్ తెలిపారు.
International | Published On Dec 28, 2025, 3.50 pm IST
Osman Hadi murder | బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీని గుర్తు తెలియని వ్యక్తులు డిసెంబర్ 12న కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో హాదీని కాల్చి చంపారు. ఆటోరిక్షాలో వెళ్తున్న హాదీపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఉస్మాన్ హాదీ మృతి చెందాడు. దీంతో బంగ్లాదేశ్ మొత్తం అట్టుడికిపోయింది. భారత్‌పై విమర్శలు చేస్తూ యాంటీ ఇండియా ప్రసంగాలు చేస్తూ బంగ్లాదేశీయులను రెచ్చగొట్టిన ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో అల్లరి మూక రెచ్చిపోయారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ మొత్తం అల్లరి మూక చేతుల్లోకి వెళ్లింది. ఇద్దరు హిందూ యువకులను కూడా అల్లరి మూక పొట్టనపెట్టుకుంది. బంగ్లాదేశ్ విధ్వంసం ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఉస్మాన్ హాదీని చంపారని అనుమానిస్తున్న ఇద్దరు అనుమానితులు అతడిని చంపి భారత్‌కి పారిపోయారంటూ ఢాకా పోలీసులు నిర్ధారించారు.
మేఘాలయాలో ఉన్న భారత్, బంగ్లాదేశ్ బోర్డర్ ద్వారా వాళ్లు భారత్‌కి పారిపోయారని చెబుతున్నారు. ఫైజల్ ఖరీమ్ మసూద్, అలామ్‌గిర్ షేక్ ఇద్దరూ మైమెన్సింగ్‌లో ఉన్న హలువాఘాట్ బోర్డర్ ద్వారా భారత్‌కి చేరుకున్నారని, వాళ్లు బోర్డర్ దాటడానికి అక్కడి స్థానికులు సాయం చేశారని ఢాకా అడిషనల్ కమిషనర్ మీడియాకు తెలిపారు.
పుర్టి అనే వ్యక్తి వీళ్లను హలువాఘాట్ బోర్డర్ వద్ద రిసీవ్ చేసుకున్నాడు. సామీ అనే టాక్సీ డ్రైవర్ వాళ్లను మేఘాలయాలో ఉన్న టురా సిటీకి పంపించాడు అని అడిషనల్ కమిషనర్ తెలిపారు.
భారత్‌కి పారిపోయాక వీళ్లు అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారని.. వాళ్లు భారత్‌కు వచ్చేలా సాయం చేసిన లోకల్స్‌ని భారత సెక్యూరిటీ ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయని.. ఇద్దరు అనుమానితులను ఎలాగైనా తిరిగి బంగ్లాదేశ్‌కి తీసుకొచ్చేందుకు భారత అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Indian High Commissioner | బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా బెంగాల్ బీజేపీ నేత!
ఏప్రిల్ 20, 2026

Hasina’s Extradition Case | షేక్ హసీనా అప్పగింతపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- ●Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
- ●Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!



