Hindu Family Houses Fire | బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. హిందువుల ఇళ్లే టార్గెట్.. 5 ఇళ్లకు నిప్పు పెట్టిన అల్లరి మూక
30 జిల్లాలో ముఖ్యంగా చంద్‌పూర్, చట్టోగ్రామ్, దినాజ్‌పూర్, సునామ్‌గంజ్, ఖుల్నా, కొమిల్లా, గాజిపూర్, తంగేల్, సైల్‌హెట్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ దాడులు చోటు చేసుకున్నాయి.
International | Published On Dec 29, 2025, 6.19 pm IST
Hindu Family Houses Fire | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆగడం లేదు. ఆ దేశంలో హిందువులు మైనార్టీలు కావడం వల్ల అల్లరి మూక వాళ్లపై చేస్తున్న దాడులపై అక్కడి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో అల్లరి మూక రెచ్చిపోయి హిందువులపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ 18న హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ని తీవ్రంగా కొట్టి చంపిన అల్లరి మూక ఆ తర్వాత కూడా మరో యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. డిసెంబర్ 24న అమ్రిత్ మొండల్ అనే హిందూ యువకుడిని రాజ్‌బారీ టౌన్‌లో అల్లరి మూకలు దాడి చేసి చంపేశారు.
తాజాగా పిరోజ్‌పూర్ జిల్లాలోని దుమ్రితాలా అనే గ్రామంలో ఉంటున్న హిందువుల్లో ఐదుగురి ఇళ్లపై అల్లరి మూక రెచ్చిపోయింది. వాళ్ల ఇళ్లకు నిప్పంటించడంతో ఆ ఇళ్లన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఓ ఇంట్లోకి నిప్పు పెట్టిన క్లాత్‌ని నిరసనకారులు విసిరేశారని.. దాని వల్ల పక్కన ఉన్న పలు ఇండ్లకు కూడా మంటలు అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంటికి నిప్పు పెట్టడానికి ముందే బయటి నుంచి లాక్ వేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున ఎవ్వరూ లేని సమయం చూసి ఇళ్లకు నిప్పంటించారు.
ఇళ్లకు మంటలు అంటుకున్న సమయంలో అందులో ఆయా ఇళ్లకు చెందిన కుటుంబ సభ్యులు అందులోనే చిక్కుకున్నారు. ఆ తర్వాత ఎనిమిది మంది ఇంటికి ఉన్న కిటికీలను, వెదురు ఫెన్సింగ్‌ని కాళ్లతో తన్ని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఢాకా నుంచి 240 కిమీల దూరంలో ఈ గ్రామం ఉంది.
ఈ ఘటనపై స్పందించిన పిరోజ్‌పూర్ ఎస్పీ అహ్మద్ సిద్దిఖీ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ నేరానికి పాల్పడ్డారనే అనుమానంతో ఐదుగురు అనుమానితులను లోకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇళ్లకు మంటలు అంటుకున్న సమయంలో మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత ఆరు నెలల్లో 71 ఘటనలు
ఈ సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు పర మతాన్ని కించపరిచారని, దైవ దూషణ చేశారన్న ఆరోపణలతో హిందూ మైనార్టీలపై దాడులకు సంబంధించి 71 ఘటనలు చోటు చేసుకున్నాయని బంగ్లాదేశ్‌కి చెందిన హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ ఫర్ బంగ్లాదేశ్ మైనార్టీస్(HRCBM) తాజాగా రిపోర్ట్‌ని విడుదల చేసింది.
30 జిల్లాలో ముఖ్యంగా చంద్‌పూర్, చట్టోగ్రామ్, దినాజ్‌పూర్, సునామ్‌గంజ్, ఖుల్నా, కొమిల్లా, గాజిపూర్, తంగేల్, సైల్‌హెట్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ దాడులు చోటు చేసుకున్నాయి.
🚨 Bangladesh
An attack on Hindu minorities continues to raise serious concern. In Dumritola village of Pirojpur district, a house belonging to a Hindu family was reportedly set ablaze by an extremist Islamist mob.
Authorities have launched an investigation as calls grow louder… pic.twitter.com/Yul4dTf5q5— World News (@World_Breaking_) December 29, 2025
తాజావార్తలు
- ●Snake Village of India | షెట్ఫల్ @ స్నేక్ విలేజ్ ఆఫ్ ఇండియా.. నాగుపాములతో గ్రామస్తుల సహజీవనం..!
- ●Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- ●Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!
- ●Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Snake Village of India | షెట్ఫల్ @ స్నేక్ విలేజ్ ఆఫ్ ఇండియా.. నాగుపాములతో గ్రామస్తుల సహజీవనం..!

Traffic Restrictions | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

Anganwadi Job Notification | నిరుద్యోగ మహిళలకు తీపికబురు.. త్వరలోనే 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ..!

Heat Wave | నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలు.. విలవిలలాడిపోతున్న ప్రజలు





