Donlad Trump | ఒబామా దంపతులపై జాతివివక్ష.. వివాదం రేపుతున్న ట్రంప్ షేర్‌చేసిన వీడియో..
Donlad Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama), ఆయన భార్య మిచెల్ ఒబామా (Michelle Obama)ను కించపరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donlad Trump) పోస్టు చేసిన జాతివివక్ష వీడియో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
International | Published On Feb 7, 2026, 11.32 am IST
Donlad Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama), ఆయన భార్య మిచెల్ ఒబామా (Michelle Obama)ను కించపరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donlad Trump) పోస్టు చేసిన జాతివివక్ష వీడియో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒబామా దంపతులను కోతులుగా మార్చి వ్యంగ్యంగా సామాజిక మాధ్యమంలో ఉంచారు ట్రంప్. ఈ వీడియోపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ట్రంప్ తీరుపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోపై వివాదం ముదరడంతో దాన్ని చివరికి ట్రంప్ తొలగించారు.
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో గురువారం రాత్రి ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో ఒబామా దంపతుల ముఖాలను ఏఐ సాంకేతికతతో కోతుల శరీరాలకు తగిలించి అత్యంత దారుణంగా చిత్రీకరించారు. సుమారు 12 గంటల పాటు ఆన్‌లైన్‌లో ఉన్న ఈ వీడియోపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని వర్గాలకు చెందిన వారు ట్రంప్ తీరుపై మండిపడ్డారు. ఒబామా దంపతులపై జాతి వివక్షను ప్రదర్శించేలా ఆ వీడియో ఉందంటూ విమర్శలు వచ్చాయి. అయితే, మొదట దీనిని కేవలం ఒక 'మీమ్' అని కొట్టిపారేసిన వైట్ హౌస్ వర్గాలు, ఆ తర్వాత సిబ్బంది చేసిన పొరపాటుగా అభివర్ణించాయి. ఇక ఈ వీడియోపై వివాదం ముదురుతుండటంతో అధ్యక్షుడు దాన్ని తొలగించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





