Plane Landing On Highway | రద్దీగా ఉండే హైవేపై ల్యాండ్ అయిన విమానం.. పలు కార్లు ధ్వంసం
Plane Landing On Highway | అమెరికాలోని జార్జియా (Georgia)లో ఓ చిన్న విమానం హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది (Plane Pulls Off Landing On US Highway).
International | Published On Feb 10, 2026, 10.27 am IST
Plane Landing On Highway | అమెరికాలోని జార్జియా (Georgia)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది (Plane Pulls Off Landing On US Highway). ఆ సమయంలో రహదారి రద్దీగా ఉండటంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి (Many Cars Crashes). ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాకర్ బీచ్‌క్రాఫ్ట్ BE-36 విమానం గైనెస్‌విల్లేలోని లీ గిల్మర్ మెమోరియల్ విమానాశ్రయం నుంచి కాంటన్‌లోని చెరోకి కౌంటీ ప్రాంతానికి బయల్దేరింది. అయితే, కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సింగిల్ ఇంజిన్ శిక్షణ విమానం విమానాశ్రయం వరకూ కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికారుల సూచనల మేరకు జార్జియాలోని గైనెస్‌విల్లేలోని రద్దీగా ఉండే రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో పలు వాహనాలను విమానం ఢీ కొట్టింది. దీంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలైనట్లు కూడా పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (Federal Aviation Administration) అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
https://x.com/mishika_singh/status/2021043756074664219
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






