త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Global Terrorism Index | గ్లోబ‌ల్ టెర్ర‌రిజం ఇండెక్స్‌లో పాకిస్తాన్ టాప్‌

Global Terrorism Index | పాకిస్తాన్ తొలిసారిగా ప్రపంచంలో అత్యధిక ఉగ్రవాద ప్రభావం దేశంగా నిలిచింది. ఆర్ధిక శాంతి పరిశోధన సంస్థ (Institute for Economics and Peace) తాజా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (Global Terrorism Index) నివేదిక ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

P

International | Published On Mar 22, 2026, 4.43 pm IST

Global Terrorism Index | గ్లోబ‌ల్ టెర్ర‌రిజం ఇండెక్స్‌లో పాకిస్తాన్ టాప్‌
Advertisement
  • ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఎక‌నామిక్స్ అండ్ పీస్ రిపోర్ట్‌

Global Terrorism Index | పాకిస్తాన్ తొలిసారిగా ప్రపంచంలో అత్యధిక ఉగ్రవాద ప్రభావం దేశంగా నిలిచింది. ఆర్ధిక శాంతి పరిశోధన సంస్థ (Institute for Economics and Peace) తాజా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (Global Terrorism Index) నివేదిక ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. నివేదిక ప్ర‌కారం.. పాక్‌లో ఉగ్రవాద దాడులు 2013 తర్వాత భారీగా పెరిగాయి. 2025లో 1,139 మంది మృతి చెందగా, 1,045 ఉగ్రదాడులు న‌మోద‌య్యాయి. ఎక్కువ భాగం ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, బలూచిస్తాన్‌లో చోటు చేసుకున్నాయి.

ఈ జాబితాలో భార‌త్ 13వ స్థానంలో నిలిచింది. గ‌తేడాది దేశంలో ఉగ్రవాద ఘటనలు 44 శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది. క్రితంతో పోలిస్తే 2025లో ఉగ్రవాద మరణాలు 28 శాతం త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఉగ్రదాడుల సంఖ్య 22శాతం తగ్గి 2,944కి చేరాయి. 81 దేశాలలో పరిస్థితి మెరుగుపడగా 19 దేశాలలో పరిస్థితి మరింత దిగజారింది. అదే సమయంలో ప్రాశ్చాత్య దేశాల్లో ఉగ్రవాద దాడులు 280 శాతం పెరిగాయి. ఉగ్ర‌వాదాన్ని అణ‌చివేసేందుకు భార‌త్ చ‌ర్య‌లు తీసుకుంటోంది. కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ప్ర‌హార్ పేరిట తొలిసారిగా జాతీయ ఉగ్ర‌వాద నిరోధ‌క విధానాన్ని విడుద‌ల చేసింది.

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నాలుగు అంశాల‌ను ఆధారంగా చేసుకొని గుర్తిస్తారు. సంవ‌త్స‌రంలో స‌ద‌రు దేశంలో జ‌రిగిన ఉగ్రదాడుల సంఖ్య, మరణాలు, గాయపడిన వారి సంఖ్య, బందీలుగా చిక్కుకున్న వారు తదితర అంశాల ఆధారంగా ర్యాంకుల‌ను నిర్ణ‌యిస్తారు. ఇదిలా ఉండ‌గా.. గ‌త కొన్నేళ్లుగా పాక్ నైజం గురించి ప్ర‌పంచానికి భార‌త్ చెబుతూ వ‌చ్చింది. ఉగ్రవాదులకు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న తీరును అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఎండ‌గ‌ట్టింది. అయినా పాక్ వక్రబుద్ధిని మార్చుకోకుండా భారత్‌పై విషం చిమ్ముతూ వచ్చింది. తాజ‌గా విడుద‌లైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ - 2026లో పాకిస్థాన్ తొలి ర్యాంకును అందుకోవ‌డంతో ఆ దేశంలో ఉగ్రవాదం ఏ స్థాయిలో ప్ర‌పంచానికి మ‌రోసారి తెలిసిపోయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement