త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mexico | యూఎస్ బాటలో మెక్సికో.. భారత్‌పై 50 శాతం టారిఫ్స్

ఈ టారిఫ్స్ చైనాపై ఎక్కువ ప్రభావం చూపించనున్నాయి. 2024 డేటా ప్రకారం 130 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను చైనా నుంచి మెక్సికో దిగుమతి చేసుకుంది. ఇప్పుడు అమలు చేయబోయే టారిఫ్స్ వల్ల అదనంగా 3.8 బిలియన్ డాలర్ల ఆదాయం జనరేట్ కానుంది. అంటే మన కరెన్సీలో రూ.33,910 కోట్లు.

J

International | Published On Dec 11, 2025, 7.16 pm IST

Mexico | యూఎస్ బాటలో మెక్సికో.. భారత్‌పై 50 శాతం టారిఫ్స్
Advertisement

Mexico | యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్ మీద తన పగను తీర్చుకుంటూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఉన్న అన్ని టారిఫ్స్‌ను డబుల్ చేశాడు. చాలా వస్తువుల మీద 50 శాతం టారిఫ్స్ విదించిన విషయం తెలిసిందే. తాజాగా మెక్సికో కూడా యూఎస్ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆసియా దేశాల నుంచి మెక్సికోకు ఎగుమతి అయ్యే వస్తువుల మీద 50 శాతం వరకు టారిఫ్స్ విధించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ టారిఫ్స్ జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తాయని సమాచారం. ఇప్పటి వరకు మెక్సికోతో భారత్, సౌత్ కొరియా, చైనా, థాయ్‌లాండ్, ఇండోనేషియా లాంటి దేశాలకు ట్రేడ్ డీల్ లేదు. కానీ.. ఇప్పుడు ఆసియా దేశాల నుంచి మెక్సికోకు ఎగుమతి అవుతున్న ఆటో పార్ట్స్, లైట్ కార్స్, క్లాత్స్, ప్లాస్టిక్, స్టీల్, బొమ్మలు, ఫర్నీచర్, ఫుట్‌వేర్, లెదర్ వస్తువులు, పేపర్, కార్డ్‌బోర్డ్, అల్యూమినియం, గ్లాస్, సబ్బులు, పర్‌ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ లాంటి వస్తువుల మీద ఈ టారిఫ్ విధించేందుకు సిద్ధం అవుతోందట.

మెక్సికో ఎందుకు కొత్తగా టారిఫ్‌లు విధిస్తోంది?

ఆసియా దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద ఎక్కువగా ఆధారపడకుండా స్వంత బ్రాండ్‌లను తయారు చేసేందుకు మెక్సికో ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వస్తువుల మీద మెక్సికో ఫోకస్ పెట్టింది. ఏకపక్షంగా టారిఫ్‌లు పెంచడాన్ని మేము ఎప్పటికీ ఒప్పుకోం అని చైనా తాజాగా స్పష్టం చేసింది.

చైనాపై ఎక్కువ ప్రభావం

ఈ టారిఫ్స్ చైనాపై ఎక్కువ ప్రభావం చూపించనున్నాయి. 2024 డేటా ప్రకారం 130 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను చైనా నుంచి మెక్సికో దిగుమతి చేసుకుంది. ఇప్పుడు అమలు చేయబోయే టారిఫ్స్ వల్ల అదనంగా 3.8 బిలియన్ డాలర్ల ఆదాయం జనరేట్ కానుంది. అంటే మన కరెన్సీలో రూ.33,910 కోట్లు.

భారత్‌పై టారిఫ్స్ ప్రభావం ఎంత?

భారత్ నుంచి మెక్సికోకు ఎక్కువగా కార్లు ఎక్స్‌పోర్ట్ అవుతుంటాయి. వోల్క్స్‌వాగన్, హ్యుందాయ్, నిస్సాన్, మారుతి సుజుకీ కంపెనీలు భారత్‌లో తయారైన కార్లను మెక్సికోకు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాయి. ఇవి ఒక సంవత్సరానికి ఒక బిలియన్ డాలర్ల వాల్యూను కలిగి ఉంటాయి. కార్ల ఎగుమతిపై ప్రస్తుతం ఉన్న 20 శాతం ఇంపోర్ట్ డ్యూటీ 50 శాతానికి అయితే కార్ల ఎగుమతి కంపెనీలపై టారిఫ్ భారం పడనుంది. సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత భారత్ నుంచే మెక్సికోకు ఎక్కువగా కార్లు ఎగుమతి అవుతుంటాయి. అందుకే ఈ టారిఫ్ వల్ల ఇండియన్ ఆటోమొబైల్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపనుంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement