US-Iran Conflict | ప్రమాదకరంగా యూఎస్-ఇరాన్ యుద్ధం..! పైలట్ సజీవంగా పట్టుకుంటే విలువైన బహుమతి ఇస్తామన్న టెహ్రాన్..!
US-Iran Conflict | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత గల్లంతైన తమ పైలట్లు, సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం భారీ గాలింపు చర్యలు చేపట్టింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానం కూలిపోయినట్లు నిర్ధారించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
International | Published On Apr 3, 2026, 9.35 pm IST
US-Iran Conflict | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత గల్లంతైన తమ పైలట్లు, సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం భారీ గాలింపు చర్యలు చేపట్టింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానం కూలిపోయినట్లు నిర్ధారించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తమ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసిందని ఇరాన్ మీడియా పేర్కొంటోంది. నైరుతి ఇరాన్‌లో పారాచూట్ ద్వారా సురక్షితంగా కిందకు దిగిన పైలట్‌ను ప్రస్తుతం బందీగా పట్టుకున్నారని చెబుతోంది. ఇదిలా ఉండగా, ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపానికి దక్షిణాన, ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కొత్త వాయు రక్షణ వ్యవస్థ ద్వారా అమెరికా ఎఫ్-35 విమానాన్ని కూల్చివేశారని ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా ప్రధాన కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
విమానం నుంచి పైలట్ సురక్షితంగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువని పేర్కొన్నారు. మరో వైపు టెహ్రాన్‌లో మరో అధునాతన అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేశారని ఇరాన్ మెహర్ న్యూస్ ఏజెన్సీ కూడా పేర్కొంది. అయితే, అమెరికా ఇప్పటివరకు ఒక ప్రమాదం జరిగిందని, ఒక ఆపరేషన్ కొనసాగుతోందని మాత్రమే నివేదించింది. ఆ విమానం కచ్చితంగా ఏంటో ఇంకా నిర్ధారించాల్సి ఉంది. శత్రు పైలట్‌ను సజీవంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన వారికి విలువైన బహుమతి ఇస్తామని హామీ ఇచ్చింది. నిజానికి, ఆ ప్రాంతంపై అమెరికా విమానాలు ఎగురుతున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను పొరుగు నగరమైన కరాజ్‌తో కలిపే బీ1 వంతెనపై సైన్యం వైమానిక దాడి చేసిందని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఇరాన్ ఆయుధ రవాణాను అడ్డుకోవడమే ఈ దాడి లక్ష్యమని అమెరికా చెబుతోంది. ఈ గందరగోళం మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇజ్రాయెల్, అమెరికాలతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ మూసివేసిన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి గుండా ఫ్రాన్స్‌కు చెందిన ఒక సరుకు రవాణా నౌక సురక్షితంగా ప్రయాణించింది.
The US-Israel-Iran war is now becoming more and more interesting. Iran is continuously causing huge damage to America and Israel. First F-35 and now F-15 was shot down. #Irán #Israël #F_15 pic.twitter.com/zSWn7Ud5yN
— Ruksar Khan (@Ruksar_Khan_002) April 3, 2026
సంబంధిత వార్తలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



