Donald Trump | ఆమె మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు.. అందుకే స్విస్‌పై టారిఫ్‌ను మరో తొమ్మిది శాతం పెంచా : ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలపై అధిక టారిఫ్‌లు విధించిన ట్రంప్.. తాజాగా స్విట్జర్లాండ్ (Switzerland)పై కూడా సుంకాలు ప్రకటించారు.
International | Published On Feb 11, 2026, 2.22 pm IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలపై అధిక టారిఫ్‌లు విధించిన ట్రంప్.. తాజాగా స్విట్జర్లాండ్ (Switzerland)పై కూడా సుంకాలు ప్రకటించారు. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 30 శాతం టారఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ తొలుత ప్రకటించారు. ఆ తర్వాత ఈ సుంకాలను 39 శాతానికి పెంచారు. తొమ్మిది శాతం సుంకాల పెంపుపై ట్రంప్‌ను ప్రశ్నించగా.. ఆయన ఓ విచిత్రమైన కారణం చెప్పారు. స్విస్ నేత (Swiss leader) మాట్లాడిన తీరు తనకు నచ్చకపోవడంతోనే సుంకాలు తొమ్మిది శాతం పెంచినట్లు చెప్పుకొచ్చారు.
ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విచిత్ర కారణాన్ని చెప్పారు. "సుంకాలు పెంచిన వెంటనే నాకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తొలుత టారిఫ్‌ల ప్రకటన నేపథ్యంలో స్విస్ ప్రధాని చేశాడని అనుకున్నా. కానీ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ కెల్లర్ (Karin Keller)నాతో మాట్లాడింది. ఆ సమయంలో ఆమె తమది చిన్న దేశమని, సుంకాల భారం మోయలేమంటూ చెప్పింది. అప్పుడు నేను మీది చిన్న దేశమే.. కానీ అమెరికాతో వాణిజ్యంలో 42 శాతం మిగులు ఉందని చెప్పా. అయినప్పటికీ ఆమె ‘మాది చిన్నదేశం’ అని పదేపదే చెప్పింది. ఆమె మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు. అందుకే సుంకాలు తగ్గించకుండా మరో తొమ్మిది శాతం పెంచాను" అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






