Israel | లెబనాన్‌పై బోన్స్ చిల్లింగ్ కెమికల్స్ వాడారు.. ఇజ్రాయెల్‌పై తీవ్రమైన ఆరోపణలు..!
Israel | సౌత్ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం వైట్ ఫాస్ఫరస్ షెల్స్‌ను ప్రయోగించినట్లుగా హ్యూమన్ రైట్స్ వాచ్ తీవ్ర ఆరోపనలు చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రమాదకర రసాయనాలను నివాస ప్రాంతాల్లో ఉపయోగించారని సంస్థ పేర్కొంది.
International | Published On Mar 9, 2026, 4.26 pm IST
Israel | సౌత్ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం వైట్ ఫాస్ఫరస్ షెల్స్‌ను ప్రయోగించినట్లుగా హ్యూమన్ రైట్స్ వాచ్ తీవ్ర ఆరోపనలు చేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రమాదకర రసాయనాలను నివాస ప్రాంతాల్లో ఉపయోగించారని సంస్థ పేర్కొంది. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం.. సంస్థ దాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించింది. ఇందులో ఏడు చిత్రాలను పరిశీలించగా దక్షిణ లెబనాన్‌లోని యోహ్మోర్ గ్రామంలో నివాస ప్రాంతాలపై వైట్ ఫాస్ఫరస్ ఆర్టిలరీని ఇజ్రాయెల్ ఉపయోగించినట్లుగా తేలిందని పేర్కొంది. దాడికి కొన్ని గంటల ముందూ ఈ గ్రామంతో పాటు దక్షిణ లెబనాన్‌లోని మరికొన్ని గ్రామాల ప్రజలకు ఆ ప్రాంతం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసినట్లు తన నివేదికలో పేర్కొంది. అయితే, దాడి జరిగిన సమయంలో గ్రామంలో పౌరులు ఉన్నారా లేదా.. ఎవరైనా గాయపడ్డారా? అన్న విషయాన్ని తాము స్వతంత్రంగా నిర్ధారించలేకపోయామని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది.
వైట్ ఫాస్ఫరస్ ఎందుకు ప్రమాదకరం..?
మానవ హక్కుల కార్యకర్తల ప్రకారం.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైట్ ఫాస్ఫరస్ వినియోగం అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించినట్టే. ఈ రసాయనం మానవశరీరంలోని ఎములను సైతం బూడిదగా మారుస్తుంది. చిన్న కాలిన గాయాలు కూడా బాధితులను ఇన్ఫెక్షన్, అవయవ వైఫల్యం, తీవ్రమైన శ్వాసకోశ సమస్యల బారినపడేలా చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్‌లో లెబనాన్ పరిశోధకుడు రంజీ ఖైస్ మాట్లాడుతూ.. నివాస ప్రాంతాలపై వైట్ ఫాస్ఫరస్ వినియోగం అత్యంత ఆందోళనకరమని, ఇది పౌరులకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చని అన్నారు. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. అయితే, గతంలో మాత్రం వైట్ ఫాస్ఫరస్‌ను పౌరులను లక్ష్యంగా చేసేందుకు కాకుండా స్మోక్ స్క్రీన్ సృష్టించడానికి మాత్రమే ఉపయోగిస్తామని సైన్యం తెలిపింది. గతంలో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య జరిగిన యుద్ధ సమయంలోనూ వైట్ ఫాస్ఫరస్ ఉపయోగించినట్లుగా హ్యూమన్ రైట్స్ వాచ్, అంనెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు పేర్కొన్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






