H-1B Visa Crisis | అమెరికా వెళ్లే వారికి షాక్: 2027 వరకు హెచ్-1బి వీసా ఇంటర్వ్యూలు లేనట్టే
అమెరికా వీసా కోసం నిరీక్షణ మరింత భారమైంది. కొత్త నిబంధనల కారణంగా భారత దేశంలోని అమెరికా కాన్సులేట్లలో హెచ్-1బి, హెచ్-4 వీసా ఇంటర్వ్యూ తేదీలు 2027 వరకు వాయిదా పడుతున్నాయి. 18 నెలల తర్వాత వీసా ఇంటర్వ్యూలు ఉంటాయని అభ్యర్థులకు మెయిల్స్ వస్తున్నాయి.
International | Published On Jan 25, 2026, 4.51 pm IST
సంక్షిప్త సారాంశం
అమెరికా అమలు చేస్తున్న కఠినమైన సోషల్ మీడియా తనిఖీల వల్ల భారత దేశంలో హెచ్-1బి వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ లిస్ట్ 2027 వరకు పెరిగిపోయింది. 2026 ప్రారంభంలో ఇంటర్వ్యూలు ఉన్నవారికి కూడా 2027 మే నెలకు తేదీలను రీషెడ్యూల్ చేస్తున్నారు. దీనివల్ల వేలమంది భారతీయ టెక్కీలు స్వదేశంలో చిక్కుకుపోగా, మరికొందరు అమెరికా నుంచి ఇండియాకు రావడానికి భయపడుతున్నారు.
H-1B Visa Crisis | త్రినేత్ర.న్యూస్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్కీలకు, ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న హెచ్-1బి వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత దేశంలోని అమెరికా కాన్సులేట్లలో హెచ్-1బి వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ పీరియడ్ అసాధారణంగా పెరిగిపోయింది. తాజా నివేదికల ప్రకారం, ప్రస్తుతం 2027 వరకు రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేవని తెలుస్తోంది.
ఎందుకు ఈ జాప్యం?
గత డిసెంబర్ 15 నుంచి అమెరికా విదేశాంగ శాఖ అమలులోకి తెచ్చిన 'సోషల్ మీడియా వెట్టింగ్' (Social Media Vetting) విధానమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా మారింది. ప్రతి అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి రావడంతో, ఒక్కో ఇంటర్వ్యూ సమయం పెరిగి, రోజువారీ ఇంటర్వ్యూల సంఖ్య సగానికి పడిపోయింది. దీనికి తోడు, ఇతర దేశాల్లో (Third Country Processing) వీసా స్టాంపింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా అమెరికా నిలిపివేయడంతో ఒత్తిడి మొత్తం భారత కాన్సులేట్లపైనే పడింది. తద్వారా డిసెంబర్ 15 నుంచి షెడ్యూల్ అయిన వీసా ఇంటర్వ్యూలన్నీ వాయిదా పడ్డాయి. డిసెంబర్ 15 తర్వాత ఇంటర్వ్యూ షెడ్యుల్ అయిన వాళ్లు, జనవరి 2026 లో ఇంటర్వ్యూలు ఉన్నవారికి కూడా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. ముందుగా ఏప్రిల్, మే 2026 నెలల్లో ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేస్తామని కాన్సులేట్ అధికారులు అభ్యర్థులకు మెయిల్స్ పంపించారు. కానీ.. ఇప్పుడు ఆ రీషెడ్యూలింగ్ కాస్త 18 నెలల తర్వాత అంటే ఏప్రిల్, మే 2027 కి మారుస్తూ ఈమెయిల్స్ పంపిస్తున్నారు.
అయోమయంలో హెచ్-1బి ఉద్యోగులు
వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వచ్చిన వేలమంది ఐటీ నిపుణులు తిరిగి వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. దీనివల్ల వారి ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బి హోల్డర్లు అత్యవసరమైతే తప్ప వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు రావొద్దని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కి వచ్చిన వాళ్లకు కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ఆఫర్ చేస్తున్నాయి. కానీ.. ఎన్ని నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందో తెలియదు. ఎప్పుడు కంపెనీ ఆఫీసులకు రావాలంటాయో అని ఐటీ నిపుణులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




