Jeffrey Epstein Files | ఎప్‌స్టీన్ చిట్టాలో భారతీయ యువతి.. ఆమె కోసం అమెరికా వేట..! లీకైన ఈమెయిల్స్‌లో ఏముందంటే?
జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో భారతీయ యువతి పేరు బయటపడటం కలకలం రేపుతోంది. ఆమెకు పరిహారం అందజేయడానికి అమెరికా అధికారులు ప్రయత్నించినట్లు ఈమెయిల్స్ ద్వారా తెలిసింది. అసలు ఆ లేఖలో ఏముంది?
International | Published On Feb 17, 2026, 8.05 pm IST
Jeffrey Epstein Files | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచాన్ని కుదిపేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) స్కాండల్‌లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా బయటపడ్డ పత్రాల్లో (Epstein Documents) ఒక భారతీయ యువతి ప్రస్తావన రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎప్‌స్టీన్ లైంగిక దాష్టీకానికి బలైన వారిలో భారత్‌కు చెందిన మహిళ కూడా ఉన్నట్లు తాజా ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు ఆ ఈమెయిల్‌లో ఏముంది?
ఎప్‌స్టీన్ కేసు విచారణలో భాగంగా బయటకు వచ్చిన ఈమెయిల్స్‌లో.. 2020, జనవరి 13వ తేదీన పంపిన ఒక మెయిల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎప్‌స్టీన్ బాధితులకు పరిహారం (Compensation), కౌన్సిలింగ్ ఇప్పించే బాధ్యతను పర్యవేక్షిస్తున్న అధికారులు.. భారత్‌లో ఉన్న ఒక బాధితురాలిని గుర్తించేందుకు ప్రయత్నించినట్లు ఇందులో ఉంది.

భారతీయ ఎంబసీతో సంప్రదింపులు
ఆ మెయిల్‌లో అమెరికా అధికారి ఏమన్నారంటే.. "చివరగా, భారత్‌లో ఉన్న వ్యక్తి (బాధితురాలు) విషయానికి వస్తే.. మీరు ఆమె చిరునామా, కాంటాక్ట్ వివరాలు నాకు అందించగలిగితే, నేను అక్కడి ఎంబసీ (రాయబార కార్యాలయం)లోని మా సహోద్యోగులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటాను" అని పేర్కొన్నారు.
పరిహారం కోసం గాలింపు
బాధితులకు న్యూయార్క్ క్రైమ్ విక్టిమ్స్ కాంపెన్సేషన్ ద్వారా సాయం అందించడానికి, ఎఫ్‌బీఐ (FBI) పేపర్‌వర్క్ పూర్తి చేయడానికి అధికారులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఫ్లోరిడాలోని బాధితులకు థెరపీ సెషన్ల కోసం నిధులు కేటాయించినట్టే, ఈమెకు కూడా సాయం చేయడానికి వారు సిద్ధపడినట్లు ఆ లేఖ ద్వారా తెలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




