త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Elderly Woman Protestor in Tehran | “నేను చనిపోయి 47 ఏళ్లయింది.. నాకేం భయం లేదు” ఇరాన్ నిరసనల్లో వృద్ధురాలి గర్జన

1979లో ఇస్లామిక్ విప్లవం ద్వారా షా మొహమ్మద్ రెజా పహ్లావీ పాలన అంతమై, అయతుల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడి సరిగ్గా 47 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ వృద్ధురాలు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

J

International | Published On Jan 10, 2026, 5.17 pm IST

Elderly Woman Protestor in Tehran | “నేను చనిపోయి 47 ఏళ్లయింది.. నాకేం భయం లేదు” ఇరాన్ నిరసనల్లో వృద్ధురాలి గర్జన
Advertisement

Elderly Woman Protestor in Tehran | ఇరాన్‌లో ప్రభుత్వం అణచివేతలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య ఒక వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది. ఆర్థిక కష్టాలు, ప్రభుత్వ అరాచకాలు, సామాజిక ఆంక్షలు, మహిళల హక్కుల ఆంక్షలపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఇరాన్ ప్రజలకు ఈమె ఇప్పడు ఒక స్ఫూర్తిదాయక చిహ్నంగా మారింది.

వృద్ధురాలి ధిక్కారం

టెహ్రాన్ వీధుల్లో రాత్రివేళ జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న ఈ వృద్ధురాలు, నోటి నుండి రక్తం కారుతున్నా లెక్కచేయకుండా గర్జిస్తూ ముందుకు సాగింది. అది నిజంగా రక్తమా లేక నోట్లో రక్తం లాంటి రంగు వేసుకున్నదో తెలియదు కానీ ఆమె గర్జిస్తున్న వీడియో మాత్రం ఇరాన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "నాకు భయం లేదు.. నేను చనిపోయి 47 ఏళ్లయింది" అని ఆమె అరుస్తున్న వీడియో మాత్రం అందరినీ కదిలిస్తుంది.

1979లో ఇస్లామిక్ విప్లవం ద్వారా షా మొహమ్మద్ రెజా పహ్లావీ పాలన అంతమై, అయతుల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడి సరిగ్గా 47 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ వృద్ధురాలు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ వీడియోను ఇరానియన్-అమెరికన్ జర్నలిస్ట్ మాసిహ్ అలీనెజాద్ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. "ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనతో విసిగిపోయిన ఒక మహిళ గొంతు. 47 ఏళ్ల క్రితం మా హక్కులను లాగేసుకుని దేశాన్ని బందీగా మార్చారు. ఈరోజు ప్రజల దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు, అందుకే వారు తిరుగుబాటు చేస్తున్నారు" అని ఆమె ట్వీట్ చేశారు.

ALSO READ 7202
Advertisement

తాజావార్తలు

Advertisement