Woman Dies | విమానం గాల్లో ఉండగా ప్రయాణికురాలు మృతి.. 13 గంటల పాటు మృతదేహంతోనే ప్రయాణం..!
Woman Dies | హాంకాంగ్ నుంచి లండన్‌కు బయలుదేరి బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీఏ32 విమానంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గంట తర్వాత ప్రాణాలు కోల్పోయింది.
International | Published On Mar 22, 2026, 4.14 pm IST
Woman Dies | హాంకాంగ్ నుంచి లండన్‌కు బయలుదేరి బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీఏ32 విమానంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గంట తర్వాత ప్రాణాలు కోల్పోయింది. విమానాన్ని తిరిగి హాంకాంగ్‌కు మళ్లించకుండా పైలట్లు హీత్రో ఎయిర్‌పోర్ట్‌కే వెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైన సమయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేస్తారు. అయితే, మరణిస్తే మాత్రం పరిగణలోకి తీసుకోరని సమాచారం.
అయితే, మృతదేహాన్ని సిబ్బంది మొదట బాత్‌రూమ్‌లో ఉంచాలని భావించారు. చివరకు మృతదేహాన్ని విమానం వెనుక భాగంలోని గ్యాలీ (సిబ్బంది ఉపయోగించే ప్రాంతం)లోకి తరలించారు. అయితే, విమానమంతా చల్లగా ఉన్నా ఇక్కడ మాత్రం వేడిగా ఉంటుంది. ఈ విషయాన్ని సిబ్బంది గమనించలేదు. విమానం ప్రయాణం కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా విమానంలో దుర్వాసన వచ్చింది. దాదాపు 13 గంటల ఇతర ప్రయాణీకులు మృతదేహంతోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. చివరకు విమానం హీత్రో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బ్రిటీష్ ఎయిర్‌వేస్ స్పందించింది. మృతురాలు విమానంలో మృతి చెందిందని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపింది. ఆమె కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తున్నామని, ఈ సమయంలో అన్ని ప్రోటోకాల్స్‌ను పాటించినట్లు చెప్పింది.
ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి సందర్భాల్లో మృతదేహాన్ని సాధారణంగా బాడీ బ్యాగ్‌లో, మెడ వరకు కప్పి ఉంచుతారు. వీలైతే ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా వేరే ప్రాంతంలో ఉంచుతారు. విమానం పూర్తిగా నిండిపోయిన సమయంలో సదరు ప్రయాణికుడి సీటులోనే ఉంచాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. 2013లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. విమానాల్లో జరిగే వైద్య అత్యవసర పరిస్థితుల్లో మరణాల శాతం చాలా తక్కువగా ఉంది. కేవలం 0.3 శాతం మాత్రమే మరణాలు నమోదైనట్లుగా పేర్కొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



