త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Canada PM Mark Carney India visit | ట్రంప్ టారిఫ్ భయం.. భారత్ వైపు కెనడా చూపు: మార్చిలో ప్రధాని మార్క్ పర్యటన.. 17 వేల కోట్ల యురేనియం డీల్

అమెరికా వాణిజ్య ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో కెనడా తన వ్యూహాన్ని మార్చుకుంది. భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ మార్చి మొదటి వారంలో భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో దాదాపు 2.8 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

J

International | Published On Jan 26, 2026, 10.00 pm IST

Canada PM Mark Carney India visit | ట్రంప్ టారిఫ్ భయం.. భారత్ వైపు కెనడా చూపు: మార్చిలో ప్రధాని మార్క్ పర్యటన.. 17 వేల కోట్ల యురేనియం డీల్

సంక్షిప్త సారాంశం

కెనడా మాజీ ప్రధాని ట్రూడో హయాంలో భారత్‌తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను మార్క్ కార్నీ సరిదిద్దబోతున్నారు. ఇంధనం, రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఒప్పందాలతో పాటు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు ప్రారంభం కానున్నాయి. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, భారత్‌ను కీలక భాగస్వామిగా మార్చుకోవడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.

Advertisement

Canada PM Mark Carney India visit | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ ఆంక్షలు ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో, కెనడా భారత్‌తో తన బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది. కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ మార్చి మొదటి వారంలో భారత్‌లో పర్యటించనున్నట్లు కెనడాలో భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ వెల్లడించారు.

భారీ యురేనియం ఒప్పందం

ఈ పర్యటనలో అత్యంత కీలకమైనది. సుమారు 2.8 బిలియన్ కెనడియన్ డాలర్ల (సుమారు రూ. 17,400 కోట్లు) విలువైన 10 ఏళ్ల యురేనియం సరఫరా డీల్‌పై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు చమురు, గ్యాస్, కీలక ఖనిజాల సరఫరాపై కూడా ఒప్పందాలు కుదరనున్నాయి.

సంబంధాల రీసెట్ – CEPA చర్చలు

గత ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య ఉదంతంతో భారత్-కెనడా సంబంధాలు క్షీణించాయి. అయితే మార్క్ కార్నీ ఈ విభేదాలను పక్కన పెట్టి భారత్‌తో సంబంధాలను 'రీసెట్' చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా మార్చి నుంచే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కోసం అధికారిక చర్చలు ప్రారంభం కానున్నాయి. ఏడాది కాలంలోనే ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

అమెరికా హెచ్చరికల నేపథ్యంలో వ్యూహాత్మక అడుగు

చైనాతో కెనడా ఒప్పందాలు చేసుకుంటే భారీ టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో, కెనడా తన వాణిజ్యాన్ని ఇతర దేశాలకు విస్తరించాలని నిర్ణయించుకుంది. గ్లోబల్ ట్రేడ్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో జతకట్టడం కెనడాకు అనివార్యంగా మారింది.

ఈ పర్యటనకు ముందుగా వచ్చే నెల ఫిబ్రవరిలో భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) ఒట్టావాలో పర్యటించి భద్రత, ఇంటెలిజెన్స్ అంశాలపై చర్చించనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ కూడా త్వరలో కెనడా వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement