Telangana | ఎల్ నినోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Telangana | రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై సమీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మంత్రి వర్గ ఉపసంఘానికి చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామకం అయ్యారు.
చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం సలహాదారు రామకృష్ణారావు
ఎల్ నినోను ఎదుర్కొనేందుకు సిఫారసులు చేయనున్న కమిటీ
Telangana | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై సమీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మంత్రి వర్గ ఉపసంఘానికి చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామకం అయ్యారు. సభ్యులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, వాకిటి శ్రీహరి, సీతక్క ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం సలహాదారు రామకృష్ణారావును నియమించారు. దీనికి కన్వీనర్‌గా ప్రణాళిక శాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఈ సబ్‌కమిటీ ఎల్‌నినోపై సమీక్షించి ఎప్పటికప్పుడు ఆదేశాలు, సూచనలు ఇవ్వనుంది.
ఈ కేబినెట్ సబ్‌కమిటీ రాష్ట్రంలోని కరువు, ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత శాఖలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తుంది. అలాగే ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సిఫార్సులు అందించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై నివేదికలను సమర్పించనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం - ఫొటోలు చూశారా
- ●Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు
- ●Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు
- ●US Middle East Travel Alert 2026 | మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న సంక్షోభం: సౌదీ, యూఏఈ సహా 12 దేశాలకు అమెరికా 'సెక్యూరిటీ అలర్ట్'
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..
- ●Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ

Rashmika Mandanna | తెలంగాణ కోడలిగా రష్మిక బతుకమ్మ సంబురం - ఫొటోలు చూశారా

Chariot Festival | స్వర్ణరథంపై శ్రీనివాసుడి దర్శనం.. గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు

Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు

US Middle East Travel Alert 2026 | మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న సంక్షోభం: సౌదీ, యూఏఈ సహా 12 దేశాలకు అమెరికా 'సెక్యూరిటీ అలర్ట్'






