Toxic Gas Leak | గనిలో విషవాయువులు లీకై 37 మంది మృతి
Toxic Gas Leak | పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియా (Nigeria)లో విషాదం చోటు చేసుకుంది. ఉత్తర-మధ్య నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకై (Toxic Gas Leak) 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Feb 19, 2026, 3.55 pm IST
Toxic Gas Leak | పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియా (Nigeria)లో విషాదం చోటు చేసుకుంది. ఉత్తర-మధ్య నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకై (Toxic Gas Leak) 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 26 మంది ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఘటన ప్లాటూ రాష్ట్రంలోని కంపానీ జురాక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
గనిలో కార్మికులు పనుల్లో ఉండగా విషవాయువులు లీకయ్యాయి. విషపూరితమైన సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. మైనర్లే ఎక్కువగా ప్రభావితమైనట్లు చెప్పారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గని ప్రాంతాన్ని మూసివేసి దర్యాప్తు చేపట్టారు.
నైజీరియాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సాధారణమే. ఈ క్రమంలో జరిగే ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తాజాగా జరిగిన ప్రమాదంలో అక్కడ ఎలాంటి తవ్వకాలు జరుగుతున్నాయి..? ఆ పనులకు ప్రభుత్వ అనుమతి ఉందా..? లేదా..? వంటి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Top ISIS Leader | ఐసిస్‌కు బిగ్ షాక్.. టాప్ కమాండర్ అబు బిలాల్ మినూకీ హతం.. ప్రకటించిన ట్రంప్
మే 16, 2026

Harish Rao | పొంగులేటిని కాపాడేందుకే సీబీసీఐడీ ఎంక్వైరీ : హరీశ్‌రావు
మార్చి 29, 2026

Dasoju Sravan | మరో KGFలా ప్రకృతి వనరుల దోపిడీ.. అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్సీ దాసోజు ధ్వజం
మార్చి 5, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



