Harish Rao | పొంగులేటిని కాపాడేందుకే సీబీసీఐడీ ఎంక్వైరీ : హరీశ్‌రావు
Harish Rao | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాపాడేందుకే సీబీసీఐడీ ఎంక్వైరీ వేశారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. మంత్రి తప్పు చేసిండని ఆయన కింద పని చేసే పోలీసులు రిపోర్టు ఇచ్చిన ఉదంతం ఉందా..? అని హరీశ్‌రావు నిలదీశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాపాడేందుకే సీబీసీఐడీ ఎంక్వైరీ వేశారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. మంత్రి తప్పు చేసిండని ఆయన కింద పని చేసే పోలీసులు రిపోర్టు ఇచ్చిన ఉదంతం ఉందా..? అని హరీశ్‌రావు నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
మంత్రి కంపెనీ అవినీతికి పాల్పడ్డదని సీఎం, మంత్రి చెప్పారు.. నేను చెప్పలేదు. మంత్రి అవినీతికి పాల్పడ్డప్పుడు సీబీసీఐడీ ఎలా ఎంక్వైరీ చేయగలుగుతది. ఆయన గవర్నమెంట్ కదా.. ఈ దేశ చరిత్రలో మంత్రి తప్పు చేసిండని ఆయన కింద పని చేసే పోలీసులు రిపోర్టు ఇచ్చిన ఉదంతం ఉందా..? అసలు జరుగుతదా.. అందుకే మంత్రిని డిస్మిస్ చేయాలి. లేదా సీబీఐ కాకుండా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి.. అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయండి అని డిమాండ్ చేశాం. కానీ రేవంత్ మంత్రిని కాపాడడానికి సీబీసీఐడీ ఎంక్వైరీ వేసిండు. చిత్తశుద్ధి వేసి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సీబీసీఐడీ ఎంక్వైరీ వేయండి. చిత్తశుద్ది ఉంటే హౌస్ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించు.. ఇదంతా మంత్రిని కాపాడే ప్రయత్నం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
మీరు చేస్తే ఒప్పు.. మేం అడిగితే తప్పా..
అదానీ కుంభకోణాల మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని రాహుల్ అంటడు. స్టాక్ మార్కెట్ క్రాష్ మీద వేయమని ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. మీరు చేస్తే ఒప్పు మేం అడిగితే తప్పా. ఎందుకు ముందుకు రావడం లేదు హౌస్ కమిటీ వేయడానికి. అన్ని బయటకు వస్తాయి కదా.. నీ కాంగ్రెస్ పార్టీ ఓబుళాపురం మైన్స్ మీద హౌస్ కమిటీ వేసింది కదా..? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు. అంటే ఇవాళ మేం ఈ స్కాంను బయటపెట్టాం. ఇవాళ సీఎం ఏమంటున్నరు.. మేమే బయటపెట్టాం.. మేమే కట్టించాం అంటున్నడు. ఏ కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో పని చేసినా సీనరేజీ చార్జీలు కట్ చేస్తారు. ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. పొంగులేటి ఎక్కడ్నో హెచ్ఎండీసీఎల్‌లో ఒక కాంట్రాక్ట్ చేస్తే ప్రతి కాంట్రాక్టు బిల్లులో కట్ చేసినట్టు ఆటోమేటిక్‌గా సీనరేజ్ కట్ చేశారు. దానికి అక్రమ మైనింగ్‌కు సంబంధం లేదు. ఇల్లీగల్ మైన్‌కు సీనరేజ్ చార్జ్ కట్టుడు ఉంటదా..? దానికి ఫైన్ కట్టుడు ఎక్కడ ఉంటుంది. మైనింగ్ డిపార్ట్‌మెంట్ రెండు షోకాజ్ నోటీసులు జారీ చేసింది మంత్రికి. రెండు లెటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాశారు. పెనాల్టీ 28 లక్షలు వేశారు. కడితే చూపించండి.. రేవంత్ రెడ్డి రికవరీ చేసినం అంటున్నారు కదా..? అని మాజీ మంత్రి నిలదీశారు.
షోకాజ్ నోటీసును టిష్యూ పేపర్‌లాగా పడేశారు..
అసలు లెక్క చేయలేదు.. నేనే రాజు నేనే మంత్రి.. షోకాజ్ నోటీసును టిష్యూ పేపర్‌లాగా పడేశారు. మంత్రి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇంత స్పష్టంగా ఉంటే రికవరీ చేశామని బుకాయించే ప్రయత్నం చేశారు. మంత్రిని కాపాడబోయి.. ఒక అబద్దాన్ని దాచబోయి వంద అబద్ధాలు ఆడినట్టు.. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు అసెంబ్లీలో రెడ్ హ్యాండెండ్‌గా పది తప్పులు చేసింది ఈ ప్రభుత్వం. ఓపెన్‌గా దొరికిపోయారు. ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయొచ్చా అని మైనింగ్ మంత్రి అంటున్నరు. గతంలో ఓఎంసీ కంపెనీ మీద హౌస్ కమిటీ వేశారు కదా.. అది ఒకటే కంపెనీ కదా. మీటర్లు దొరకుతలేవు అని డిజీల్ జనరేట్లను పర్మిట్ చేశారట. మరి కాగితం ఉందా.. ఎన్ని కంపెనీలకు ఇచ్చారో బయటపెట్టండి. సీఎఫ్ ఈ, సీఎఫ్‌వో లేదని ఈ రాష్ట్రంలో మొత్తం క్రషర్లకు విద్యుత్ కట్ చేశారు. ఇవి సబ్ మిట్ చేసిన వారికే కరెంట్ ఇచ్చారు. ఇవాళ వందల కంపెనీలకు విద్యుత్ లేదు. పర్మిషన్ లేదు. మైనింగ్ లైసెన్స్ లేదు. సీఎఫ్ఈ, సీఎఫ్‌వో అనుమతులు పీసీబీ నుంచి లేవు కనుక.. ఇది ఇల్లీగల్ మైన్ కాబట్టే జనరేటర్ మీద నడుపుతున్నారు. ఆ తప్పును ఒప్పుకోలేక మీటర్ల కొరత ఉందని జనరేట్ల మీద నడుపుతున్నారని ఇంకో తప్పు మాట్లాడారు. హరీశ్‌రావు ఆరోపించినట్టు నోటీసులు ఇచ్చినట్టు నాకు తెల్వదు అంటడు మంత్రి. నేను నోటీసు కాపీలనే చూపించాను కదా. కేవలం ఇది నాలుగు లక్షల రూపాయాల దానికి ఇంత మాట్లాడుతారా..? అని మంత్రి అంటున్నరు. ఫస్ట్ డిమాండ్ నోటీసులోనే 28 లక్షల 50 వేల రూపాయాలు పెనాల్టీ కట్టమని మైనింగ్ శాఖ నోటీసులు ఇచ్చింది. 5130 మెట్రిక్ టన్నుల మెటల్ ఉంది కాబట్టి.. 28 లక్షల 50 వేలు కట్టమన్నారు. రెండోసారి తనిఖీ చేస్తే 11,200 మెట్రిక్ టన్నులు దొరికిందని షోకాజ్ నోటీసు ఇచ్చారు. కోటి రూపాయాలు పెనాల్టీ అయితది. రెండోసారి తప్పు చేస్తే ఏడాది జైలు శిక్ష వేయాలని నిబంధనలు ఉన్నాయి. ఈ రెండున్నర ఏండ్ల నుంచి రోజుకు కోటి అంటే ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది. ఎన్ని వందల కోట్లు ఈ కంపెనీకి పెనాల్టీ వేయాలి. ఎన్ని రోజులు అక్రమ క్రషింగ్ జరిగింది. అంటే వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది అని హరీశ్‌రావు తెలిపారు.
ప్రేమ ఉన్నట్టు గంటపాటు ఊకదంపుడు ఉపన్యాసం..
శ్రీధర్ బాబు అంటారు.. పొంగులేటి ఏదో అన్నారని ఏదో పత్రికలో వస్తే దాని మీద హరీశ్‌రావు మాట్లాడుతున్నరు అంటున్నరు. ఏదో పత్రిక కాదు.. మైనింగ్ మంత్రి పత్రిక వెలుగు పత్రికలోనే పొంగులేటి స్టేట్‌మెంట్ వచ్చింది.. దాన్నే బయటపెట్టాను. ఆరోపణలు చేయలేదు పక్క ఆధారాలతో మాట్లాడాను. ఇవాళ ఏట్ల మాట్లాడుతాడు.. మైనింగ్ ఎజెండా లేనే లేదని మంత్రి పొన్నం అంటడు. పరిశ్రమల శాఖలోనే మైనింగ్ ఉంటుందన్న విషయం తెలియకపోవడం శోచనీయం. ఆయన చెప్పింది వాస్తవమో అవాస్తవమో అని భట్టి అంటున్నరు. మీరు ఫిర్యాదు ఇవ్వొచ్చు కదా అని ఆది శ్రీనివాస్ అంటడు. అందరికీ 50 ఫిర్యాదులు ఇచ్చాం. ముఖ్యమంత్రి కూడా రాఘవకు, పొంగులేటికి ఏం సంబంధం అని మాట్లాడుతున్నడు. పొంగులేటిని కాపాడబోయి వంద అబద్ధాలు ఆడుతూ బుకాయించే ప్రయత్నంలో తికమక పడి మరిన్ని తప్పులు చేసి రెడ్ హ్యాండెండ్‌గా దొరికిపోయారు. దాన్నుంచి తప్పించుకోవడానికి నామీద వ్యక్తిగతమైన దాడి.. కౌశిక్ రెడ్డి మీద ఎథిక్స్ కమిటీ, దళితుల యాంగిల్ తీసుకొచ్చి.. వారి మీద ప్రేమ ఉన్నట్టు గంటపాటు ఊకదంపుడు ఉపన్యాసం చేశారు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Ponguleti Srinivas Reddy | దొరల గడీల్లో బందీ అయిన భూమిని విడిపిస్తాం.. పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం: మంత్రి పొంగులేటి
మే 21, 2026

Harish Rao | తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా: హరీశ్ రావు
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



