Jewellery Theft | ఇంట్లో నగలు కొట్టేశాడు.. ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు
Jewellery Theft | ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా క్రెడిట్ కార్డులు (Credit Cards) గీకేశాడు. అప్పులపాలయ్యాడు. అప్పుల్లో నుంచి బయటపడేందుకు సొంత ఇంట్లోనే దొంగగా మారాడు. కొంచంకొంచంగా అందినకాడికి ఎత్తుకెల్లాడు. ఆపై తనపైకి రాకుండా ఇంట్లో నగలు (Jewellery Theft) మాయమయ్యాయని అతడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Jewellery Theft | త్రినేత్ర.న్యూస్: ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా క్రెడిట్ కార్డులు (Credit Cards) గీకేశాడు. అప్పులపాలయ్యాడు. అప్పుల్లో నుంచి బయటపడేందుకు సొంత ఇంట్లోనే దొంగగా మారాడు. కొంచంకొంచంగా అందినకాడికి ఎత్తుకెల్లాడు. ఆపై తనపైకి రాకుండా ఇంట్లో నగలు (Jewellery Theft) మాయమయ్యాయని అతడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అసలు దొంగ అతడేనని పోలీసులు తేల్చడంతో ఆశ్చర్యపోవడం అందరివంతయ్యింది.
హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన కృష్ణమూర్తి తన తల్లి, భార్యతోపాటు ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తున్నాడు. ఇంట్లోని కింది అంతస్తులో తల్లి, కృష్ణమూర్తి దంపతులు, పెద్ద కుమారుడు ఉంటున్నారు. భవనం పెంట్‌హౌస్‌లో రెండో కుమారుడు భాస్కర్ ప్రమోద్ (32), మూడో కుమారుడు ఉంటున్నారు. భాస్కర్ గదిలో ఉన్న బీరువాలోనే బంగారు ఆభరణాలు ఉన్నాయి.
అయితే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ద్వారా అప్పులు చేసిన భాస్కర్.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో 2024 నుంచి కొంచం కొంచంగా ఇంట్లోని సుమారు 11 తులాల బంగారు నగలను దొంగిలించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టాడు. అలా వచ్చిన రూ.4.60 లక్షలు సొంతానికి వాడుకున్నాడు. తన దొంగతనం విషయం బయటపడితే ఇబ్బంది అవుతుందని అనుకున్నాడో ఏమో.. ఎలాగైనా అందులో నుంచి బయటపడాలనుకున్నాడు.
దీంతో ఈ నెల 9న తన పెంట్‌హౌస్‌లో చోరీ జరిగినట్లు నాటకం ఆడాడు. దుండగులు బంగారు నగలు ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్, కాల్‌డేటా విశ్లేషణతోపాటు సాంకేతిక ఆధారాలతో ఫిర్యాదు చేసిన వ్యక్తే నిందితుడని తేల్చారు. దీంతో భాస్కర్‌ను అరెస్టు చేశారు.
సంబంధిత వార్తలు

Credit Cards | క్రెడిట్ కార్డులను ఇలా వాడితేనే లాభం.. లేదంటే అప్పుల భారం..
మే 16, 2026

FD Backed Credit Cards | ఎఫ్డీ ఆధారిత క్రెడిట్ కార్డులను తీసుకుంటే లాభమా.. నష్టమా..?
ఏప్రిల్ 25, 2026

Credit Card Bill | ఒక క్రెడిట్ కార్డు బిల్లును ఇంకో కార్డుతో నేరుగా చెల్లించడం ఎందుకు సాధ్యం కాదు..?
ఫిబ్రవరి 24, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



