New Year | న్యూఇయర్ రోజు ఫ్యామిలీతో ఉంటారా.. జైళ్లో ఉంటారా: సీపీ సజ్జనార్
New Year | నూతన సంవత్సర (New Year) వేడుకల సందర్భంగా నగర వాసులు ఫ్యామిలీతో ఉంటారో.. జైళ్లో ఉంటారో తేల్చుకోవాలని నగర పోలీస్ కమిషనర్ (Police Commissioner) సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive)లో పట్టుబడితే జైళ్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
New Year | నూతన సంవత్సర (New Year) వేడుకల సందర్భంగా నగర వాసులు ఫ్యామిలీతో ఉంటారో.. జైళ్లో ఉంటారో తేల్చుకోవాలని నగర పోలీస్ కమిషనర్ (Police Commissioner) సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive)లో పట్టుబడితే జైళ్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ నడుస్తోందని చెప్పారు. ఇది జనవరి 1వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు. న్యూ ఇయర్ రోజు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోమని సూచించారు. డేంజరస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌లను ఎవరూ ప్రోత్సహించకూడదని కోరారు. 2025లో ఇప్పటి వరకు 5,818 డేంజరస్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశామని వివరించారు.
నగరం భద్రత, స్వేచ్ఛ కోసం పోలీసులు ముందుంటారని అన్నారు. సాంకేతికతను మరింత సమర్థవంతంగా ఉపయోగించి, నేరాలను తగ్గించే విధంగా పని చేస్తామని వివరించారు. వచ్చే ఏడాది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృత్రిమ మేథ ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడిన వారు సులభంగా కేసు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న ఆయన షీ టీమ్స్ బృందాలను మరింత పటిష్టపరిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కరికీ అప్రమత్తత అవసరమని సీపీ చెప్పారు. దీనిపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం పోలీసులు పాటుపడుతున్నారన్నారు. 2024లో 322 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 368 కేసులలో రూ.6.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిఘాను పెంచి డ్రగ్స్‌ను పూర్తిగా నివారించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






