త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vedic and Scriptural Promotion Society | ముగిసిన వేద శాస్త్ర ప్రవర్ధక సభ దశాబ్ది ఉత్సవాలు

Vedic and Scriptural Promotion Society | గ‌త నెల 29న హైద‌రాబాద్‌లోని గోప‌న్‌ప‌ల్లిలో ప్రారంభ‌మైన‌ వేద శాస్త్ర ప్రవర్ధక సభ దశాబ్ది ఉత్సవాలు నేటితో ముగిశాయి.

S

Hyderabad | Published On Oct 1, 2026, 3.08 pm IST

Vedic and Scriptural Promotion Society | ముగిసిన వేద శాస్త్ర ప్రవర్ధక సభ దశాబ్ది ఉత్సవాలు
Advertisement

Vedic and Scriptural Promotion Society | త్రినేత్ర న్యూ: గ‌త నెల 29న హైద‌రాబాద్‌లోని గోప‌న్‌ప‌ల్లిలో ప్రారంభ‌మైన‌ వేద శాస్త్ర ప్రవర్ధక సభ దశాబ్ది ఉత్సవాలు నేటితో ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర శృంగేరి ప్రతినిధి వి.రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన.. రాచర్ల రవిచంద్ర శర్మ, చెబియం రాఘవ శర్మల నేతృత్వంలో పలువురు వేద విద్వాంసుల సహకారంతో ఈ సభలు మూడు రోజుల పాటు ఘ‌నంగా నిర్వహించారు. హవన పూర్ణాహుతి, పట్టా ప్రదానం, పండిత సన్మాన కార్యక్రమాలను వైభ‌వంగా నిర్వ‌హించారు.

దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురువుల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో వీటిని నిర్వ‌హించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 10వ చతుర్వేద సదస్సు, సామవేద హవనం, గాయత్రీ హవనం చేప‌ట్టారు. తెలంగాణలో వైదిక విద్యకు సాధికారత కల్పించడం, స్వాభిమానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సంస్థ గత పదేళ్లుగా వేద పరీక్షలను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహిస్తోంది. సుమారు 10 రాష్ట్రాల నుంచి వివిధ శాఖలకు చెందిన వేద విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరై, సముచిత పత్రాలను పొందుతున్నారు.

కేవలం వేద పరీక్షలకే పరిమితం కాకుండా స్మార్త, శాస్త్ర సభలను కూడా నిర్వహించడం ఈ కార్యక్రమాల ప్రత్యేకతగా నిలిచింది. తిరుమల, కాశీ, శృంగేరి, కంచి వంటి ప్రముఖ సంస్థానాలకు చెందిన ఆస్థాన విద్వాంసులు, పరీక్షాధికారులు, పండితులు ఈ కార్యక్రమాల‌కు హాజ‌ర‌య్యారు. దీంతో సభ గొప్ప పండిత సమ్మేళనంగా నిలిచింది.

దశాబ్ది ఉత్సవాల్లో పలువురు విద్వాంసులను ప్రత్యేకంగా సన్మానించడంతో పాటు, పాఠశాలల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులకు భవిష్యత్‌ విద్య, మార్గదర్శనంపై సూచనలు అందించారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వారిచే నిర్వహిస్తున్న‌ ఏకైక వైదిక వేద శాస్త్ర ప్రవర్ధక సభగా, వేద పరీక్షలు నిర్వహించి సముచిత పత్రాలను అందించే సంస్థగా గత పదేళ్లుగా సభ అవిరళ కృషి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement