త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | వ‌న‌స్థ‌లిపురంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి దారుణ హ‌త్య‌

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని వ‌న‌స్థ‌లిపురంలో శ‌నివారం అర్ధ‌రాత్రి దారుణం జ‌రిగింది. ప‌నామా వ‌ద్ద ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తిని అత్యంత కిరాత‌కంగా చంపారు.

S

Hyderabad | Published On Jul 12, 2026, 2.15 pm IST

Hyderabad | వ‌న‌స్థ‌లిపురంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి దారుణ హ‌త్య‌
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని వ‌న‌స్థ‌లిపురంలో శ‌నివారం అర్ధ‌రాత్రి దారుణం జ‌రిగింది. ప‌నామా వ‌ద్ద ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తిని అత్యంత కిరాత‌కంగా చంపారు. మృత‌దేహాన్ని గ‌మ‌నించిన మార్నింగ్ వాక‌ర్స్, స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న వ‌న‌స్థ‌లిపురం పోలీసులు.. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు. మృతుడి శ‌రీరంపై బ‌ల‌మైన గాయాలు, క‌త్తిపోట్లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివ‌రాల కోసం పోలీసులు య‌త్నిస్తున్నారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement