Food Adulteration | కోడిగుడ్లు తింటున్నారా? పగులగొడితే ప్లాస్టిక్ లాంటి సొన.. బయటపడ్డ షాకింగ్ నిజం!
ఆన్‌లైన్‌లో 'హెన్‌ఫ్రూట్' గుడ్లు ఆర్డర్ చేసిన కస్టమర్‌కు దిమ్మతిరిగే అనుభవం ఎదురైంది. పగులగొడితే రబ్బరులాంటి సొన, వికృతమైన వాసనతో షాక్‌కు గురైన బాధితురాలు ఏం చేసిందో తెలుసా?
Viral news | Published On Jun 15, 2026, 11.55 pm IST
Food Adulteration | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని థానేలో (Thane) అత్యంత దారుణమైన ఆహార కల్తీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం నమ్మి కొనే బ్రాండెడ్ కోడిగుడ్లు కూడా ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నాయి. ఖరేగావ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
అసలేం జరిగింది?
జూన్ 12న సదరు మహిళ ఇన్‌స్టామార్ట్ (Instamart) యాప్ ద్వారా 'హెన్‌ఫ్రూట్' (Henfruit) ప్రోటీన్ మ్యాక్స్ ప్యాక్డ్ గుడ్లను ఆర్డర్ చేసింది. ప్యాకెట్ పైన ఎక్స్‌పైరీ డేట్ (Expiry Date) ఇంకా చాలా సమయం ఉంది. అయితే, వంట కోసం ఆ గుడ్లను పగులగొట్టగా ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
ఆ గుడ్ల నుంచి భయంకరమైన దుర్వాసన రావడమే కాకుండా, లోపల ఉండే సొన (Yolk) వింతగా రబ్బరు లేదా ప్లాస్టిక్ లాంటి ఆకృతిలో ఉంది. ఎంత పగులగొట్టినా అది సహజమైన గుడ్డులా కాకుండా గట్టిగా ఉండటంతో ఆమె నిర్ఘాంతపోయింది.
కంపెనీ స్పందన సున్నా.. ఫుడ్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు
వెంటనే బాధితురాలు సదరు బ్రాండ్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. కానీ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ నంబర్ అందుబాటులోకి రాలేదు. దీంతో నాణ్యతపై మరింత అనుమానం పెరగడంతో, ఆమె నేరుగా ఆహార భద్రతా విభాగానికి (Food Department) అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఆన్‌లైన్ ఫుడ్ సేఫ్టీపై అనుమానాలు
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో దొరికే ఇలాంటి 'ప్రీమియం' లేదా 'ప్రోటీన్ రిచ్' ఆహార పదార్థాల నాణ్యత (Quality Control)పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్స్‌పైరీ డేట్ ఉన్నప్పటికీ గుడ్లు ఇలా ప్లాస్టిక్ ముక్కల్లా మారడం వెనుక ఏదైనా పెద్ద ముఠా హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మీరు కూడా ఆన్‌లైన్‌లో గుడ్లు లేదా ఇతర ప్యాక్డ్ ఆహార పదార్థాలు కొనేటప్పుడు కేవలం ఎక్స్‌పైరీ డేట్ మాత్రమే కాకుండా, వాటి రంగు, వాసనను కూడా జాగ్రత్తగా గమనించండి. ఏమాత్రం అనుమానం వచ్చినా అధికారులకు ఫిర్యాదు చేయండి.
A shocking incident of food adulteration has come to light in Kharegaon, Thane. A consumer who ordered a pack of 'Henfruit' Protein Max eggs via Instamart on June 12th was horrified when she cracked them open. The eggs, well within their expiry date, contained a foul-smelling… pic.twitter.com/OXnlkx9VSe
— Pune Mirror (@ThePuneMirror) June 15, 2026
తాజావార్తలు
- ●ICICI Lombard E20 Fuel | E20 పెట్రోల్ కొట్టిస్తే ఇన్సూరెన్స్ ఇవ్వరా? నాలుక్కర్చుకున్న ఐసీఐసీఐ లాంబార్డ్
- ●MP Chamala | నిపర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల
- ●Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?
- ●Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్
- ●OTT | ఓటీటీలోకి తెలుగు వయలెంట్ యాక్షన్ మూవీ - థియేటర్లలో జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డ్
- ●Waterlogging Hotspots | మొదలైన వానలు.. వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్నతాధికారుల పర్యటన

ICICI Lombard E20 Fuel | E20 పెట్రోల్ కొట్టిస్తే ఇన్సూరెన్స్ ఇవ్వరా? నాలుక్కర్చుకున్న ఐసీఐసీఐ లాంబార్డ్

MP Chamala | నిపర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల

Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?

Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్



