త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | గండిపేట చెరువులో ఈత‌కు వెళ్లిన ముగ్గురు మృతి

Hyderabad | హైద‌రాబాద్ (Hyderabad) గండిపేట చెరువులో (Gandipet Cheruvu) ఈత‌కు వెళ్లిన ముగ్గురు యువ‌కులు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం (మార్చి 15) చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకులు గల్లంత‌య్యారు.

G

Hyderabad | Published On Mar 16, 2026, 1.26 pm IST

Hyderabad | గండిపేట చెరువులో ఈత‌కు వెళ్లిన ముగ్గురు మృతి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ (Hyderabad) గండిపేట చెరువులో (Gandipet Cheruvu) ఈత‌కు వెళ్లిన ముగ్గురు యువ‌కులు మృతిచెందారు. ఆదివారం సాయంత్రం (మార్చి 15) చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకులు గల్లంత‌య్యారు. స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలో సోమవారం మృతదేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. మృతులు కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25)గా గుర్తించారు. వారిని ఇబ్రహీంబాగ్, లంగ‌ర్‌హౌస్ ప్రాంతాల‌కు చెందిన వారిగా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement