Drunk and Drive | మద్యం తాగారు.. పోలీసులకు చిక్కారు
Drunk and Drive | డ్రంక్ అండ్ డ్రైవ్ లో 294 మంది పోలీసులకు పట్టుబడ్డారని సైబరాబాద్ ట్రాఫిక్ ADCP ట్రాఫిక్ I, జి.హన్మంతరావు తెలిపారు. 255 ద్విచక్ర వాహనదారులు, 5 ఆటోలు, 34 కార్లు, హెవీ వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
- సైబరాబాద్ వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 294 మందిపై కేసులు
Drunk and Drive | త్రినేత్ర.న్యూస్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 294 మంది పోలీసులకు పట్టుబడ్డారని సైబరాబాద్ ట్రాఫిక్ ADCP ట్రాఫిక్ I, జి.హన్మంతరావు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 294 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 255 ద్విచక్ర వాహనదారులు, 5 ఆటోలు, 34 కార్లు, హెవీ వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
కోర్టులో హాజరు..
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే.. 244 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 30 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 20 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారన్నారు. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు.
గరిష్టంగా 10 ఏండ్ల జైలు..
మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్ర నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.
గత వారం (18.05.2026-23.05.2026) లో మొత్తం 156 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీరిలో10 మందికి జరిమానా, జైలు శిక్ష, ఒకరికి జరిమానా, సోషల్ సర్వీస్, 145 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?




