త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Main Vaapas Aaunga | ‘మై వాపస్ ఆవూంగా’… నెట్ ఫ్లిక్స్‌లో ఈ అర్ధరాత్రి నుంచే…

Main Vaapas Aaunga | భారత విభజన నాటి చేదు జ్ఞాపకాలు, ఒక అసంపూర్ణ ప్రేమకథ ఆధారంగా దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన చిత్రం 'మై వాపస్ ఆవూంగా. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించి.. భావోద్వేగంతో క‌ట్టిపడేసిన ఈ ప్రేమ క‌థ‌.. ఈ అర్ధ‌రాత్రి నుంచి ఓటీటీల్లో సంద‌డి చేయ‌నుంది.

S

Entertainment | Published On Aug 6, 2026, 5.37 pm IST

Main Vaapas Aaunga | ‘మై వాపస్ ఆవూంగా’… నెట్ ఫ్లిక్స్‌లో ఈ అర్ధరాత్రి నుంచే…
Advertisement

Main Vaapas Aaunga | త్రినేత్ర‌.న్యూస్ : భారత విభజన నాటి చేదు జ్ఞాపకాలు, ఒక అసంపూర్ణ ప్రేమకథ ఆధారంగా దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన చిత్రం 'మై వాపస్ ఆవూంగా. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించి.. భావోద్వేగంతో క‌ట్టిపడేసిన ఈ ప్రేమ క‌థ‌.. ఈ అర్ధ‌రాత్రి నుంచి ఓటీటీల్లో సంద‌డి చేయ‌నుంది. ఆగస్టు 7న మై వాప‌స్ ఆవుంగా మూవీ నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌ల కానుంది. నసీరుద్దీన్ షా, దిల్జీత్ దొసాంజ్, వేదాంగ్ రైనా, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీని రూ. 70 కోట్ల బడ్జెట్‌తో చిత్రీక‌రించ‌గా, బాక్సాఫీస్ దగ్గర రూ. 97.37 కోట్లు వసూలు చేసింది.

మై వాప‌స్ ఆవుంగా మూవీతో పాటు.. ఆప‌రేష‌న్ స‌ఫేద్ సాగ‌ర్ కూడా ఓటీటీల్లో అల‌రించ‌నుంది. ఈ చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల కానుంది. ఈ మూవీలో సిద్ధార్థ్, జిమ్మీ షేర్గిల్, అభయ్ వర్మ నటించారు. ఓనీ సేన్ దర్శకత్వంలో కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం పోషించిన వీరోచిత పాత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది.

Advertisement
Advertisement