CM Revanth Reddy | ట్యాంక్ బండ్ శివకు సీఎం రేవంత్ రెడ్డి చేయూత
CM Revanth Reddy | ట్యాంక్ బండ్ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలను రక్షించి గుర్తింపు పొందిన శివకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా స్పందించి శికు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
CM Revanth Reddy | ట్యాంక్ బండ్ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలను రక్షించి గుర్తింపు పొందిన శివకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా స్పందించి శికు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. శివ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం మంజూరు చేయడంతో పాటు, ఆయన కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగ నియామకపత్రాన్ని సీఎం అందజేశారు.
ట్యాంక్ బండ్‌పై అనేక మంది ప్రాణాలను కాపాడిన శివ ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఇటీవల సీఎం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల క్రితం అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి కల్పనలో భాగంగా ట్యాంక్ బండ్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని శివ చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చేతులమీదుగా సాయం అందుకోవడంపై శివ, ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



