త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | స‌ర్ వేగ‌వంతం చేయాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ క‌ర్ణ‌న్‌

P

Hyderabad | Published On Apr 27, 2026, 9.35 pm IST

SIR | స‌ర్ వేగ‌వంతం చేయాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ క‌ర్ణ‌న్‌
Advertisement

SIR | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పురోగతిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అన్ని ఈఆర్‌ఓలు (EROs), ఏఈఆర్‌ఓలు (AEROs) పాల్గొన్నారు. ఈ సందర్భంగా స‌ర్ మ్యాపింగ్ పనులపై కమిషనర్ సమగ్రంగా సమీక్షించారు. ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) రోజుకు వంద మంది ఓటర్లను, ప్రతి సూపర్‌వైజ‌ర్ రోజుకు 1000 మంది ఓటర్లను మ్యాప్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాలను మే 5వ తేదీ లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రకళతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స‌ర్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయడానికి సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.

Advertisement
Advertisement