త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rowdy Sheeters | బిల్లుక‌ట్ట‌మ‌న్నందుకు రెస్టారెంట్ సిబ్బందిపై దాడి.. స‌రూర్‌న‌గ‌ర్‌లో రౌడీషీట‌ర్ల హ‌ల్‌చ‌ల్‌

Rowdy Sheeters | హైద‌రాబాద్‌ సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు (Rowdy Sheeters) హ‌ల్‌చ‌ల్ చేశారు. రెస్టారెంట్‌లో (Restaurant) బిల్లు కట్టమన్నందుకు సిబ్బంది, యాజమాన్యంపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు.

G

Hyderabad | Published On May 6, 2026, 10.13 am IST

Rowdy Sheeters | బిల్లుక‌ట్ట‌మ‌న్నందుకు రెస్టారెంట్ సిబ్బందిపై దాడి.. స‌రూర్‌న‌గ‌ర్‌లో రౌడీషీట‌ర్ల హ‌ల్‌చ‌ల్‌
Advertisement

Rowdy Sheeters | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌ సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు (Rowdy Sheeters) హ‌ల్‌చ‌ల్ చేశారు. రెస్టారెంట్‌లో (Restaurant) బిల్లు కట్టమన్నందుకు సిబ్బంది, యాజమాన్యంపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రౌడీషీటర్ల దాడిలో రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ దుండగులు మూకుమ్మడి దాడికిపాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. బాధితుల‌ ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ప్రధాన నిందితులైన‌ ఏదుల ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, వారి అనుచరులపై నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ‌తంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్త లలిత్‌ను ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏదుల ప్రసన్ రెడ్డి ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకొని బార్లు, రెస్టారెంట్లలో నయా దందా సాగిస్తున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement