Regional Passport Office | మే 9న స్పెషల్ పాస్‌పోర్ట్ డ్రైవ్.. 4 వేల స్లాట్లు విడుదల..!
Regional Passport Office | వేసవి రద్దీని తగ్గించడంతో పాటు.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు హైదరాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 9వ తేదీన స్పెషల్ పాస్‌పోర్టు డ్రైవర్ చేపట్టాలని నిర్ణయించింది.
Regional Passport Office | త్రినేత్ర.న్యూస్ : వేసవి రద్దీని తగ్గించడంతో పాటు.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు హైదరాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 9వ తేదీన స్పెషల్ పాస్‌పోర్టు డ్రైవర్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం కీలక ప్రకటన జారీ చేసింది.
ఈ సందర్భంగా రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ జే స్నేహజ మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం సమయానికి 4 వేల స్లాట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపారు. సంబంధిత వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకోవచ్చని ఆమె సూచించారు. ఈ ప్రత్యేక డ్రైవ్.. బేగంపేట్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్, రాయ్‌దుర్గ్, కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాల్లో ఉంటుందన్నారు.
4 వేల స్లాట్లలో 3,100 స్లాట్లు హైదరాబాద్ పరిధిలోని పాస్‌పోర్ట్ రీజినల్ కేంద్రాల్లో, మిగతా 900 స్లాట్లు నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక ఈ చిప్ ఎనబుల్డ్ పాస్‌పోర్టులు నిరంతరం జారీ చేయబడుతాయని చెప్పారు. ఇక పాత పాస్‌పోర్టులు.. వాటి కాలపరిమితి వరకు అనుమతిస్తామన్నారు.
పాస్‌పోర్టు సంబంధిత వివరాల కోసం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ నంబర్లను సంప్రదించొచ్చు. 040: 27715333, 27715115, 27806657.
వాట్సాప్ నంబర్ : 8121401532
ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ కోసం ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.. https://www.passportindia.gov.in/psp
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





