త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uppal Stadium | మ‌రికాసేపట్లో ఉప్ప‌ల్ స్టేడియానికి మెస్సీ.. పోలీసులు భారీ బందోబ‌స్తు

Uppal Stadium | ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగే మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఉప్ప‌ల్ స్టేడియం చుట్టూ 3 వేల మందితో మూడంచెల భ‌ద్ర‌త క‌ల్పించారు.

S

Hyderabad | Published On Dec 13, 2025, 4.41 pm IST

Uppal Stadium | మ‌రికాసేపట్లో ఉప్ప‌ల్ స్టేడియానికి మెస్సీ.. పోలీసులు భారీ బందోబ‌స్తు
Advertisement

Uppal Stadium | హైద‌రాబాద్ : కోల్‌కాతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అభిమానుల విధ్వంసం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఫుట్ బాల్ దిగ్గ‌జం, అర్జెంటీనా ఆటగాడు మెస్సీని చూడనివ్వకుండా నాయకులు ఫోటోలు దిగుతూ సమయం వృథా చేశారని.. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని అభిమానుల తీవ్ర నిరాశ చెందారు. దాంతో నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని స్టేడియంలో టెంట్లు కూల్చేస్తూ, కుర్చీలు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారు.

ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్ పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మ‌రికాసేప‌ట్లో ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగే మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఉప్ప‌ల్ స్టేడియం చుట్టూ 3 వేల మందితో మూడంచెల భ‌ద్ర‌త క‌ల్పించారు. 450 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో భద్రత‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మ‌రో వైపు ఉప్పల్ స్టేడియంలో డాగ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు త‌నిఖీలు నిర్వ‌హించారు. డిజిట‌ల్ పాస్ ఉంటేనే స్టేడియంలోకి అనుమ‌తిస్తామ‌ని పోలీసులు తేల్చిచెప్పారు.

కోల్‌క‌తా ఘ‌ట‌న నేప‌థ్యంలో మెస్సీ మ్యాచ్‌కు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు : డీజీపీ

మెస్సీ మ్యాచ్ నేప‌థ్యంలో రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఉప్ప‌ల్ స్టేడియంలో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కోల్‌క‌తా ఘ‌ట‌న నేప‌థ్యంలో మెస్సీ మ్యాచ్‌కు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. కోల్‌కతాలో రోప్ పార్టీలు లేకపోవడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని ఇక్కడ అప్రమత్తంగా ఉన్నామ‌ని చెప్పారు. శ‌నివారం రాత్రి 7.15కు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి వస్తారు. కేవలం క్రీడాస్ఫూర్తి, ఫుట్ బాల్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇద. మొత్తం ప్రోగ్రాం దాదాపు గంట సేపు ఉంటుంది అని డీజీపీ పేర్కొన్నారు.

ఉప్ప‌ల్ స్టేడియంలో భ‌ద్ర‌త‌పై సీపీ స‌జ్జ‌నార్ స‌మీక్ష‌

హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ కూడా ఉప్ప‌ల్ స్టేడియంలో భ‌ద్ర‌త‌పై స‌మీక్షించారు. అనంత‌రం మాట్లాడుతూ.. మెస్సీ, రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామ‌న్నారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం. రాచకొండ కమిషనర్ ఎప్పటికప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారని సీపీ స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement