త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఇదే చివరి అవ‌కాశం.. పార్టీ ఫిరాయింపుల వ్య‌వ‌హారంలో స్పీకర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

Supreme Court | పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారాన్ని (Party Defection) తేల్చేందుకు త‌గిన స‌మ‌యం ఇచ్చినా నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌పై (Speaker Gaddam Prasad Kumar) సుప్రీం కోర్టు (Supreme Court) ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ఇదే చివ‌రి అవ‌కాశమ‌ని హెచ్చ‌రించింది.

G

Telangana | Published On Jan 16, 2026, 12.58 pm IST

Supreme Court | ఇదే చివరి అవ‌కాశం.. పార్టీ ఫిరాయింపుల వ్య‌వ‌హారంలో స్పీకర్‌పై సుప్రీం ఆగ్ర‌హం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారాన్ని (Party Defection) తేల్చేందుకు త‌గిన స‌మ‌యం ఇచ్చినా నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌పై (Speaker Gaddam Prasad Kumar) సుప్రీం కోర్టు (Supreme Court) ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ఇదే చివ‌రి అవ‌కాశమ‌ని, ఇప్ప‌టికీ నిర్ణ‌యం తీసుకోకుంటే త‌గిన ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో (Congress) చేరిన ప‌ది ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ (BRS) పార్టీ దాఖ‌లు చేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా.. ఇప్పటికే ఏడుగురి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని న్యాయ‌వాది అభిషేక్‌ సంఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. మరో ముగ్గురిని విచారించాల్సి ఉందని తెలిపారు.

దీంతో క‌లుగ‌జేసుకున్న ధ‌ర్మాస‌నం.. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామ‌ని, ఈ పాటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇదే చివరి అవకాశ‌మ‌ని, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై త్వ‌ర‌గా నిర్ణయం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. లేన‌ట్ల‌యితే తీవ్ర పరిణామాలు ఉంటాయ‌ని తెలిపింది.. అయితే ముగ్గురు ఎమ్మెల్యేల విచారణకు నాలుగు వారాల గడువు కావాలని అభిషేక్‌ సింఘ్వీ సుప్రీంకోర్టును కోరారు. దీనికి ప్ర‌తిగా రెండు వారాల్లోపురోగతి చూపిస్తే, నాలుగు వారాల సమయం ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీచేసి గెలిచిన‌ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. స్పీక‌ర్ ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునేందుకు తొలుత మూడు నెలల గ‌డువు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఐదుగురి విచార‌ణ ముగిసిందిని, మిగిలిన వారిని విచారించేందుకు మ‌రికొంత స‌మ‌యం కావాలంటూ గ‌త న‌వంబ‌ర్‌లో సుప్రీం కోర్టును స్పీక‌ర్ కార్యాల‌యం అభ్య‌ర్థించింది. అయితే దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నాటి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ గ‌వాయ్‌.. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ఎక్క‌డ జ‌రుపుకొంటారో తేల్చుకోవాలంటూ ఘాటు వ్యాక్త‌లు చేశారు. ఎమ్మెల్యేల విచార‌ణ‌కు నెల రోజుల గ‌డువు ఇచారు. దీంతో పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. సాంకేతికంగా వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని తేల్చిచెప్పారు. మ‌రో ముగ్గురిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ అన‌ర్హ‌త పిటిష‌న్‌ను పెండిలో పెట్టారు. ఆయ‌న ఇప్ప‌టికే స్పీక‌ర్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇక మిగిలిన ఇద్ద‌రు క‌డియం శ్రీహ‌రి, దానం నాగేంద‌ర్ ఇంకా వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌లేదు. త‌మ‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని వారిద్ద‌రు స్పీక‌ర్‌ను కోరారు. అయితే తాజాగా సుప్రీం కోర్టు రెండు వారాల గ‌డువు ఇవ్వ‌డంతో వారి ముగ్గురిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Advertisement

తాజావార్తలు

Advertisement