త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Numaish 2026 | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం..!

Numaish 2026 | నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో 85వ అఖిల భార‌త పారిశ్రామిక వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న‌( Numaish 2026)కు స‌ర్వం సిద్ద‌మైంది. జ‌న‌వ‌రి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్‌ను ప్రారంభం కానుంది.

S

Hyderabad | Published On Dec 26, 2025, 11.01 am IST

Numaish 2026 | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం..!
Advertisement

Numaish 2026 | త్రినేత్ర‌.న్యూస్ : నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో 85వ అఖిల భార‌త పారిశ్రామిక వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న‌( Numaish 2026)కు స‌ర్వం సిద్ద‌మైంది. జ‌న‌వ‌రి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్‌ను ప్రారంభం కానుంది. ఈ మేర‌కు సీఎంకు ఎగ్జిబిష‌న్ సొసైటీ ఆహ్వానం పంపింది. మంత్రులు కూడా నుమాయిష్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు.

1250 స్టాళ్లు ఏర్పాటు

జ‌న‌వ‌రి 1 నుంచి ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు అంటే 45 రోజుల పాటు కొన‌సాగే ఈ ఎగ్జిబిష‌న్‌లో మొత్తం 1250 స్టాళ్ల ఏర్పాటుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ కార్య‌ద‌ర్శి బీఎన్ రాజేశ్వ‌ర్ మీడియాకు వెల్ల‌డించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్మూక‌శ్మీర్, హ‌ర్యానా, బీహార్, గుజ‌రాత్, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారులు త‌మ స్టాళ్ల‌ను ఏర్పాటు చేశారు. ఇందులో హ్యాండిక్రాఫ్ట్స్, ఎల‌క్ట్రానిక్ గూడ్స్, రెడిమేడ్ దుస్తులు, ఇంటి అలంక‌ర‌ణ వ‌స్తువులు, ఫుట్ వేర్, జ్యువెల‌రీ వంటి స్టాళ్లు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి.

నుమాయిష్‌కు హాజ‌ర‌య్యే సంద‌ర్శ‌కుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. వాలంటీర్ల‌ను కూడా నియ‌మించామ‌ని పేర్కొన్నారు. స్థానిక పోలీసులు కూడా భ‌ద్ర‌త విధుల్లో పాల్గొంటార‌ని తెలిపారు.

1938లో ప్రారంభం..

హైద‌రాబాద్ న‌గ‌రంలో తొలిసారిగా ప‌బ్లిక్ గార్డెన్స్‌లో 1938లో నుమాయిష్ ప్రారంభ‌మైంది. దీనికి మొదట 'నుమాయిష్ మస్నువాత్-ఎ-ముల్కీ' అని నామ‌క‌ర‌ణం చేశారు. తొలి నుమాయిష్‌ను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement