Adluri Laxman Kumar | నెల రోజుల్లో నిజాంపేట డంపింగ్ యార్డు తరలింపు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
Adluri Laxman Kumar | ప్రజలు, విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారిన నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా పూర్తిగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
Adluri Laxman Kumar | ప్రజలు, విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారిన నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా పూర్తిగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మంగళవారం బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డిగ్రీ కళాశాల నూతన భవన ప్రాంగణం సమీపంలోని డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన తర్వాత సమస్య తీవ్రత మరింత స్పష్టమైందని తెలిపారు. “డంపింగ్ యార్డు వద్ద కొన్ని నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉంది. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీనిని వెంటనే తరలించాల్సిన అవసరం ఉంది” అని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో రూ.20 కోట్ల వ్యయంతో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం ఆధునిక హాస్టల్ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే గురుకుల విద్యార్థులు ఇక్కడికి రానున్న నేపథ్యంలో, వారికి పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. స్థానిక కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా విన్నామని మంత్రి తెలిపారు. గతంలో చిన్నారిపై కుక్కల దాడి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ అది తీవ్ర విషాదకరమని అన్నారు. అలాగే డంపింగ్ యార్డు పరిసరాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయన్న ప్రజల ఆందోళనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలో డీసీపీతో మాట్లాడి ప్రత్యేక పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేయాలని సూచిస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశిస్తామని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గతంలో డంపింగ్ యార్డు తరలింపుపై కలెక్టర్‌కు పలు ఫిర్యాదులు అందాయని మంత్రి తెలిపారు. ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ కారణంగా కొంత ఆలస్యం జరిగిందని చెప్పారు. అయితే ప్రస్తుతం అన్ని శాఖల సమన్వయంతో వేగంగా చర్యలు తీసుకుని 30 రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. “గురుకుల విద్యార్థుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రమైన పరిసరాలే ప్రభుత్వ ప్రాధాన్యత” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థ భవన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అయితే, డంపింగ్ యార్డు సమీపంలో ఉండటంతో విద్యార్థులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజల ఫిర్యాదుల మేరకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించామని, కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసి డంపింగ్ యార్డును త్వరితగతిన తరలిస్తామని వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ
- ●Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
- ●Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..
- ●Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు
- ●Mamata Banerjee | సంతకాల ఫోర్జరీ.. మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు
- ●ITR | ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంది..

Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?

Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..

Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు





