త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Urban Forest Park | హైదరాబాద్‌లో మరో అర్బన్ పార్క్.. ఎక్క‌డ ఏర్పాటు చేస్తున్నారంటే?

Urban Forest Park | కాంక్రీట్ జంగ‌ల్‌గా మారిన హైద‌రాబాద్‌లో మ‌రో అర్బ‌న్‌ పార్క్ (Urban Forest Park) అందుబాటులోకి రానుంది. వేగంగా విస్త‌రిస్తున్న న‌గ‌రం, భారీగా పెరిగిన వాహ‌నాల‌తో రోజురోజుకూ కాలుష్య‌కాసారంగా మారిపోతున్న‌ది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ (Hyderabad) న‌లు దిక్కులా ప్ర‌భుత్వం అభ‌యార‌ణ్యాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ది.

G

Hyderabad | Published On Mar 14, 2026, 7.24 am IST

Urban Forest Park | హైదరాబాద్‌లో మరో అర్బన్ పార్క్.. ఎక్క‌డ ఏర్పాటు చేస్తున్నారంటే?
Advertisement

Urban Forest Park | త్రినేత్ర‌.న్యూస్‌: కాంక్రీట్ జంగ‌ల్‌గా మారిన హైద‌రాబాద్‌లో మ‌రో అర్బ‌న్‌ పార్క్ (Urban Forest Park) అందుబాటులోకి రానుంది. వేగంగా విస్త‌రిస్తున్న న‌గ‌రం, భారీగా పెరిగిన వాహ‌నాల‌తో రోజురోజుకూ కాలుష్య‌కాసారంగా మారిపోతున్న‌ది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ (Hyderabad) న‌లు దిక్కులా ప్ర‌భుత్వం అభ‌యార‌ణ్యాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ది. న‌గ‌రం చుట్టూ అట‌వీ శాఖ భూముల్లో విస్తృతంగా మొక్క‌ల‌ను నాటి చెట్ల‌ను సంర‌క్షిస్తున్న‌ది. ఇందులో భాగంగా సాగ‌ర్ హైవేలో ఉన్న గుర్రంగూడ అట‌వీ ప్రాంతాన్ని రిజ‌ర్వ్ ఫారెస్టుగా ప్ర‌క‌టించింది. దానిని అర్బ‌న్ పార్కుగా అభివృద్ధి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించింది. దీంతో న‌గ‌రవాసులు స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకునేందుకు, సేద‌తీరేందుకు మ‌రో పార్కు త్వ‌ర‌లోనే ఏర్పాటుకానుంది.

ఎన్నో ఏండ్ల‌ నుంచి గుర్రంగూడ అటవీ భూములకు సంబంధించి జ‌రుగుతున్న‌ న్యాయ పోరాటానికి తెరపడింది. ఆమన్‌గల్ డివిజన్ పరిధిలో ఉన్న గుర్రంగూడ అటవీ భూములను రిజర్వ్ ఫారెస్ట్‌గా మార్చుతూ.. ప్ర‌భుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. 424.31 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న గుర్రంగూడ అట‌వీ భూముల‌కు తెలంగాణ ఫారెస్ట్ చట్టం–1967లోని సెక్షన్ 15 ప్రకారం.. పర్యావరణ, అటవీ శాఖ జీఓ నంబర్ 7 ద్వారా రిజర్వ్ ఫారెస్ట్ హోదా కల్పించింది.

ఈ అటవీ భూముల్లో ఉన్న సాహెబ్‌నగర్ కలాన్ గ్రామానికి చెందిన 102 ఎకరాలపై చాలా కాలంగా కోర్టులో న్యాయ వివాదం న‌డిచింది. దీనిని ‘సాహెబ్‌నగర్ కలాన్ కేసు’గా పిలుస్తారు. చివర‌కు అటవీ శాఖ చేసిన వాదనను సమర్థించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వ‌డంతో ఆక్రమణదారుల నుంచి అటవీ భూమికి విముక్తి లభించిన‌ట్ల‌యింది. దీంతో వృక్ష సంపద, జీవవైవిధ్యానికి చట్టపరంగా రక్షణ లభించనుంది. ఇక ఈ భూముల్లో ఎలాంటి అనధికారిక నిర్మాణాలు, ఆక్రమణలకు తావుండదు.

ఇప్పటికే గండిపేట, కోత్వాల్‌గూడ వంటి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులకు నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలిని అందించే గ్రీన్ లంగ్ స్పేస్‌గా గుర్రంగూడ అట‌వీ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప‌ర్యాట‌కుల‌కోసం ప్ర‌త్యేక మార్గాల‌ను ఏర్పాటు చేయనున్నారు. త్వ‌ర‌లోనే ఇది బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, సాగర్ రోడ్ ప్రాంతాల్లో నివసించే వారికి పర్యాటక కేంద్రంగా మారనుంది.

Advertisement
Advertisement