త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | బాచుప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం.. 50 ఫ‌ర్నీచ‌ర్ షాపులు ద‌గ్ధం

Fire Accident | వ‌రుస అగ్నిప్ర‌మాదాలు హైద‌రాబాద్ (Hyderabad) ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయి. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో బాచుప‌ల్లిలోని (Bachupally) విజ్ఞాన్ వీఎన్ఆర్ కాలేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది.

G

Hyderabad | Published On Mar 4, 2026, 9.07 am IST

Fire Accident | బాచుప‌ల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం.. 50 ఫ‌ర్నీచ‌ర్ షాపులు ద‌గ్ధం
Advertisement

Fire Accident | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌రుస అగ్నిప్ర‌మాదాలు హైద‌రాబాద్ (Hyderabad) ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయి. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో బాచుప‌ల్లిలోని (Bachupally) విజ్ఞాన్ వీఎన్ఆర్ కాలేజ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. కేజీఆర్ కన్వెన్షన్‌ను ఆనుకొని ఉన్న ఫర్నిచర్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్ర‌మంగా అవి ప‌క్క‌నున్న దుకాణాల‌కు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీల‌లు ఎగ‌సిప‌డ్డాయి. మొత్తం 50 షాపులు ద‌గ్ధ‌మ‌య్యాయి. వాటిలో ఉన్న సామాన్లు కూడా కాలిబూడిద‌య్యాయి.

కాగా, కొంతమంది వ్యాపారులు ఆ షాపుల్లోనే నివాసం ఉంటున్నారు. దీంతో వారు వాడే గ్యాస్ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలిపోయాయి. ఆ శబ్ధానికి చుట్టుపక్కల ఉన్న జనాలు భయంతో వ‌ణికిపోయారు. మంట‌లు ఎగ‌సిప‌డుతుండ‌టంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ (Short circuit) వ‌ల్ల‌ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

https://x.com/GUMMALLALAKSHM3/status/2028901241825440013

Advertisement
Advertisement