MP Eatala Rajender | నీతి మాటలు చెబుతున్న రంగనాథ్.. నిజంగా హిట్లర్ లెక్క చేశారు : ఎంపీ ఈటల
MP Eatala Rajender | నీతి మాటలు చెబుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. గాజులరామారంలో ఉన్న బోర్లను పీకేసీ నిజంగా హిట్లర్ లెక్క చేశారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
MP Eatala Rajender | త్రినేత్ర.న్యూస్ : నీతి మాటలు చెబుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. గాజులరామారంలో ఉన్న బోర్లను పీకేసీ నిజంగా హిట్లర్ లెక్క చేశారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రంగనాథ్ నీకు మానవత్వం ఉందా ? యుద్ధంలో పరాయి దేశం చేసినట్లు చేశారు అని ఈటల నిప్పులు చెరిగారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నేరెడ్‌మెట్ డివిజన్ పరిధిలోని ఆర్.కే.పురం, ఆఫీసర్స్ కాలనీలో పర్యటించి అనంతరం 22ఏ జీవో బాధితులతో ఈటల రాజేందర్ సమావేశమై ప్రసంగించారు. మల్కాజిగిరి మినీ ఇండియా. ఇక్కడ దేశంలో అన్ని ప్రాంతాల వారు నివాసముంటున్నారు. ఆగస్టు 13న శామీర్‌పేట ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నా చేశాను. అప్పుడు ఇంకా 22ఏ ఇంకా వెలుగులోకి రాలేదని ఈటల గుర్తు చేశారు.
30 గజాల ఇళ్లలో బ్రతికే వారి ఉసురుపోసుకుంటున్నవ్
హైడ్రా వచ్చినప్పుడు మొదట వ్యతిరేకించింది నేనే. హైడ్రా హిట్లర్ ప్రేరణతో వచ్చింది అని అప్పుడు నాకు తెలియదు. నీలం సంజీవరెడ్డి నుండి రేవంత్ రెడ్డి వరకు ఉన్న ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి లెక్క వ్యవహరించి ఉంటే హైదరాబాదులో ఇన్ని బస్తీలు వచ్చేవి కావు. ఈ ఆర్.కే.పురం కాలనీ ఏర్పడి 61 ఏళ్లు అయ్యింది. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయం తీసుకొని ఈ కాలనీని 22ఏలో పెట్టారు. నీకు తెలివి ఉంటే అప్పుడు కట్టుకున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయ్. ఒకవైపు ఇళ్ళు లేనివారికి ఇళ్ళు ఇస్తా అంటావు.. ఇంకోవైపు ఇళ్ళు కట్టుకున్న వారికి హక్కులు లేకుండా చేస్తావు. అసలు నీ వైఖరి ఏంటి. 30 గజాల ఇళ్లలో బ్రతికే వారి ఉసురుపోసుకుంటున్నవ్. హైడ్రా దుర్మార్గమైన సంస్థ పేదల ఇల్లు పేదల ఇల్లు కూలగొట్టే సంస్థ అని రాజేందర్ మండిపడ్డారు.
రంగనాథ్ నీకు మానవత్వం ఉందా ?
నీతి మాటలు చెబుతున్న రంగనాథ్.. గాజులరామారంలో 70 ఏళ్ల క్రితం కంకర మిషన్ కొట్టడానికి వచ్చి 5 ఎకరాల్లో గుడిసెలు వేసుకొని అప్పటినుండి బ్రతుకుతున్నారు. ఇప్పుడు రంగనాథ్ వచ్చి బోర్లలో నీళ్ళు ఉంటే ఇక్కడే ఉంటారని వారు వేసుకున్న బోర్లు పీకేశారు.. నిజంగా హిట్లర్ లెక్క చేశారు. రంగనాథ్ నీకు మానవత్వం ఉందా ? యుద్ధంలో పరాయి దేశం చేసినట్లు చేశారు. రంగనాథ్ నీ మీద కోపం లేదు నువ్వు చేస్తున్న పనుల మీద కోపం ఉంది. నీకు ప్రజలన్న చట్టం అన్నా గౌరవం లేదు. అదే భూమిలో 20 ఎకరాల్లో ఉన్న పెద్ద వ్యక్తులని ఒకరిని కూడా ముట్టుకోలేదు కానీ 5 ఎకరాల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్న వారి ఇల్లు కూలగొట్టి బోర్లు పీకేసి కరెంటు స్తంభాలు పీకేస్తే అక్కడే బ్రతుకుతున్నారు. పేదల మీదనా మీ ప్రతాపం. తెలివి ఉంటే దాన్ని లేఔట్ చేసింది ఎవరు? అమ్మిన బ్రోకర్ ఎవరు..? వారిని జైల్లో పెట్టండి.. పర్మిషన్ ఇచ్చిన అధికారులను జైల్లో పెట్టాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
48 గంటల పాటు అక్కడ ఉండి కూల్చివేతలు ఆపగలిగాను
మూసి మీద కూడా కొట్లాడాను. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. నేను మాట్లాడితే.. నువ్వు వచ్చి పడుకుంటావా.. అని అడిగితే నేను పడుకుని వచ్చాను. విద్యార్థిగా ఉన్నప్పుడే మూసీ పక్కనే ఉన్నవాడిని. 48 గంటల పాటు అక్కడ ఉండి కూల్చివేతలు ఆపగలిగాను. రెవెన్యూ మంత్రి సమాధానం ఇస్తుంటే నవ్వు వస్తుంది. నేను వ్యక్తిగతంగా నిన్ను విమర్శించడం లేదు. కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకొనే ముందు ఆలోచన చేయాలి కదా. ఈ పాలకులను చూస్తుంటే అసహ్యం వేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
సంబంధిత వార్తలు

MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు
ఆగస్టు 27, 2026

Minister Komatireddy Venkat Reddy | ఎన్‌హెచ్ -65.. ఆ 17 చోట్ల ఫ్లై ఓవర్లు త్వరగా పూర్తి చేయండి
ఆగస్టు 27, 2026

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు
- ●Raksha Bandhan | రక్షాబంధన్ వేళ చంద్రగ్రహణం.. సూతకం ఉంటుందా? రాఖీ కట్టొచ్చా?
- ●Minister Komatireddy Venkat Reddy | ఎన్‌హెచ్ -65.. ఆ 17 చోట్ల ఫ్లై ఓవర్లు త్వరగా పూర్తి చేయండి
- ●Mobile Phones | దొంగిలించబడ్డ 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేత
- ●Raksha Bandhan | రక్షాబంధన్ రోజున చంద్రగ్రహణం.. ఏం దానం చేయాలి?
- ●Tummidihatti Barrage | తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశం

MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు

Raksha Bandhan | రక్షాబంధన్ వేళ చంద్రగ్రహణం.. సూతకం ఉంటుందా? రాఖీ కట్టొచ్చా?

Minister Komatireddy Venkat Reddy | ఎన్‌హెచ్ -65.. ఆ 17 చోట్ల ఫ్లై ఓవర్లు త్వరగా పూర్తి చేయండి

Mobile Phones | దొంగిలించబడ్డ 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేత



