Raksha Bandhan | రక్షాబంధన్ వేళ చంద్రగ్రహణం.. సూతకం ఉంటుందా? రాఖీ కట్టొచ్చా?
Raksha Bandhan | సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) ఈ ఏడాది శుక్రవారం జరగనుంది. అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో రాఖీ కట్టే సమయంపై పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Devotional | Published On Aug 27, 2026, 7.56 pm IST
Raksha Bandhan | సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) ఈ ఏడాది శుక్రవారం జరగనుంది. అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో రాఖీ కట్టే సమయంపై పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సూతక కాలం పాటించాలా? పండుగ వేడుకలను వాయిదా వేయాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. దీంతో ఇక్కడ రక్షాబంధన్ వేడుకలకు గ్రహణ ప్రభావం ఉండదని జ్యోతిష పండితులు చెబుతున్నారు.
భారత్‌లో కనిపించని గ్రహణం
భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం ఉదయం 8.04 గంటలకు ప్రారంభమై.. 11.21 గంటలకు ముగియనుంది. అయితే, దీన్ని భారత్ నుంచి వీక్షించే అవకాశం లేదు. గ్రహణం కనిపించని ప్రాంతాల్లో సాధారణంగా దానికి సంబంధించిన సూతక కాలం, ఆంక్షలు వర్తించవని పండితులు పేర్కొంటున్నారు. అందువల్ల దేశంలో రక్షాబంధన్ పూజలు, రాఖీ కట్టే కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని సూచిస్తున్నారు.
సూతకం ఉంటుందా?
హిందూ సంప్రదాయాల ప్రకారం చంద్రగ్రహణానికి సుమారు 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుందని విశ్వాసం. ఈ సమయంలో శుభకార్యాలు చేయకపోవడం, పూజలకు దూరంగా ఉండటం వంటి ఆచారాలు కొన్ని ప్రాంతాల్లో పాటిస్తారు. అయితే ఈసారి చంద్రగ్రహణం భారత్‌లో కనిపించనందున దేశంలో సూతకం పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
గ్రహణ సమయంలో ఆచారాలివే..
గ్రహణం కనిపించే ప్రాంతాల్లో సూతక కాలం సందర్భంగా కొన్ని సంప్రదాయాలను పాటిస్తారు. వంట చేయకపోవడం, భోజనం చేయకుండా ఉండటం, ముందుగా తయారు చేసిన ఆహారంలో తులసి ఆకులు లేదా గడ్డిపరకలు ఉంచడం వంటివి అందులో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో సూతకం ప్రారంభమైన తర్వాత ద్వారాలు మూసివేసి.. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవి ప్రాంతం, కుటుంబ సంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటాయి.
రాఖీ కట్టేందుకు శుభ సమయం
2026 రక్షాబంధన్ రోజున రాఖీ కట్టేందుకు ప్రత్యేక శుభ సమయంగా ఉదయం 5.57 గంటల నుంచి 9.48 గంటల వరకు సూచిస్తున్నారు. ఈ సమయంలో సోదరులకు రాఖీ కట్టి వేడుకలు నిర్వహించుకోవచ్చు. గ్రహణం భారత్‌లో కనిపించకపోవడంతో సమయ మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని పండితుల అభిప్రాయం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు
- ●Minister Komatireddy Venkat Reddy | ఎన్‌హెచ్ -65.. ఆ 17 చోట్ల ఫ్లై ఓవర్లు త్వరగా పూర్తి చేయండి
- ●Mobile Phones | దొంగిలించబడ్డ 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేత
- ●Raksha Bandhan | రక్షాబంధన్ రోజున చంద్రగ్రహణం.. ఏం దానం చేయాలి?
- ●Tummidihatti Barrage | తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశం
- ●Theenmar Mallanna | ఇంకెన్నాళ్లు ఈ వెలమ గుత్తాధిపత్యం.. ఇక బీసీ ముఖ్యమంత్రే లక్ష్యం

MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు

Minister Komatireddy Venkat Reddy | ఎన్‌హెచ్ -65.. ఆ 17 చోట్ల ఫ్లై ఓవర్లు త్వరగా పూర్తి చేయండి

Mobile Phones | దొంగిలించబడ్డ 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేత

Raksha Bandhan | రక్షాబంధన్ రోజున చంద్రగ్రహణం.. ఏం దానం చేయాలి?




