Garlic Paste | ఎసిటిక్ యాసిడ్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!
Garlic Paste | హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బస్తీకో కల్తీ కేంద్రం వెలుగు చూస్తుంది. నిత్యం వంటింట్లో వినియోగించే చక్కెర, అల్లం వెల్లుల్లి, నూనె వంటి పదార్థాలను కల్తీ చేస్తూ విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
Garlic Paste | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బస్తీకో కల్తీ కేంద్రం వెలుగు చూస్తుంది. నిత్యం వంటింట్లో వినియోగించే చక్కెర, అల్లం వెల్లుల్లి, నూనె వంటి పదార్థాలను కల్తీ చేస్తూ విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
లాలాపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, లాలాగూడ పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి ఎసిటిక్ యాసిడ్‌ను వినియోగిస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. ఈ కెమికల్ వినియోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తున్నారు. అనంతరం వీటిని ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేసి, నకిలీ బ్రాండ్ లేబుల్స్, స్టాంపులు వేసి వివిధ కిరాణా షాపులకు, వినియోగదారులకు సరఫరా చేస్తూ అక్రమంగా లాభాలు గడిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్ యజమాని నీల వెంకటేశ్వర్లు, వర్కర్లు కే వినోద్, టీ సతీష్, ఎం శివానిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 30 కేజీల ఎసిటిక్ యాసిడ్, సుమారు 10 కిలోల గమ్, గ్రైండర్, మిక్సింగ్ మెషీన్, వెయింగ్ మెషీన్, ప్యాకింగ్ మెషీన్లు, ముడి అల్లం, వెల్లుల్లి, డేట్ స్టాంపులు, ఝాన్సీ -ఎం పేరుతో ఉన్న లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడిని సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె రాజశేఖర్, లాలాగూడ ఇన్‌స్పెక్టర్ టి అశోక్ కుమార్, ఎస్ఐ ఎస్ రాజు, ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి, వారి బృందం విజయవంతంగా నిర్వహించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





