Land Auction | ఉస్మాన్ నగర్‌లో భూముల వేలం.. రూ.51.25 కోట్లు పలికిన ఎకరం ధర
Land Auction | హైదరాబాద్‌లో మరోసారి ఎకరా భూమి (Land Auction) భారీ ధర పలికింది. తెల్లాపూర్ సమీపంలోని ఉస్మాన్‌నగర్‌లో (Osman Nagar) ఎకరా ధర రూ.51.25 కోట్లు అమ్ముడుపోయింది.
Land Auction | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో మరోసారి ఎకరా భూమి (Land Auction) భారీ ధర పలికింది. తెల్లాపూర్ సమీపంలోని ఉస్మాన్‌నగర్‌లో (Osman Nagar) ఎకరా ధర రూ.51.25 కోట్లు అమ్ముడుపోయింది. టీజీఐఐసీ (TGIIC) నిర్వహించిన వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ ఈ భూమిని దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 1లో సుమారు 10.09 ఎకరాల్లో సగటున ఎకరానికి రూ.51.25 కోట్ల ధరగా నమోదైంది. ఇది రిజర్వ్ ధర రూ.39 కోట్లతో పోలిస్తే 30శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం.
ఇక ప్లాట్ నంబర్ 6లో సుమారు 5.72 ఎకరాలు ఉండగా, ఒక్కో ఎకరానికి రూ.44 కోట్లు వరకు బిడ్లు వచ్చాయి. మొత్తం వేలంలో సగటు ధర ఒక్కో ఎకరానికి రూ.48.6 కోట్లు నమోదై మార్కెట్‌లో గట్టి పోటీని సూచించింది. ఈ రెండు ప్లాట్ల ద్వారా టీజీఐఐసీకి సుమారు రూ.769 కోట్ల ఆదాయం సమకూరింది.
గతంలో కూడా..
కాగా, అత్తాపూర్ సమీపంలోని కోకాపేటలో ఎకరా భూమి ఏకంగా రూ.151.25 కోట్లకు అమ్ముడుపోయింది. కోకాపేట నియోపొలిస్ లేఅవుట్ సర్వే నంబర్ 239, 240ల్లో 15, 16 ప్లాట్లను హెచ్ఎండీఏ ఆన్‌లైన్‌లో వేలం వేసింది. 15వ నంబర్ ప్లాట్‌ను లక్ష్మీనారాయణ గుమ్మడి తదితరులు ఎకరాకు రూ.151.25 కోట్ల చొప్పున 4.03 ఎకరాలను రూ.610 కోట్లకు దక్కించుకున్నారు. 16వ నంబర్ ప్లాట్‌ను గోద్రేజ్ సంస్థ ఎకరా రూ.147.75 కోట్ల వంతున 5.03 ఎకరాలను రూ.734 కోట్లకు సొంతం చేసుకున్నది. దీంతో మొత్తం 9.06 ఎకరాలకు రూ.1353 కోట్ల ఆదాయం సమకూరింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





