త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu Singapore Delegation | ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టండి

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.

J

Hyderabad | Published On Sep 16, 2026, 12.50 pm IST

Sridhar Babu Singapore Delegation | ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టండి

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న 'భారత్‌ ఫ్యూచర్‌ సిటీ'లో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్‌ బృందాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. సచివాలయంలో సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్‌ లీ నేతృత్వంలోని బృందంతో ఆయన సమావేశమయ్యారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాలలో విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. డిసెంబర్‌లో జరగనున్న 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్-2026'లో పాల్గొనాలని సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించారు.

Advertisement
  • సింగపూర్‌ ప్రతినిధులను కోరిన మంత్రి శ్రీధర్‌బాబు

Sridhar Babu Singapore Delegation | త్రినేత్ర.న్యూస్ : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న 'భారత్‌ ఫ్యూచర్‌ సిటీ'లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. సెమీకండక్టర్‌ రంగంలో సింగపూర్‌కు ఉన్న పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ అండ్‌ ట్రేడ్‌ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్‌ లీ నేతృత్వంలోని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది.

Invite Singapore Companies to Invest in Future City says Sridhar Babu

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తెలంగాణ

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను 'గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ హబ్'గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. హై వాల్యూ ఇండస్ట్రీస్, ఆర్ అండ్ డీ, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, లైఫ్‌సైన్సెస్, ఏరోస్పేస్, గ్రీన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Invite Singapore Companies to Invest in Future City says Sridhar Babu

గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026'లో సింగపూర్‌ ప్రభుత్వం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనేలా సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ ఎండీ శశాంకతో పాటు సింగపూర్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు డా.ఫ్రాన్సిస్ చోంగ్, జీన్ యీ, ఆట్రీ టూన్ తదితరులు పాల్గొన్నారు.

Invite Singapore Companies to Invest in Future City says Sridhar Babu

Advertisement
Advertisement