త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Grey Hornbill | విశిష్ట అతిథి హార్న్‌బిల్.. జీవితాంతం ఒకే భాగ‌స్వామితో..

Indian Grey Hornbill | ఈ ప‌క్షిపేరు హార్న్ బిల్‌. దీనిని ఇండియ‌న్ గ్రే హార్న్ బిల్ (Indian Grey Hornbill) అని కూడా పిలుస్తారు. ఇది జీవితాంతం ఒకే భాగ‌స్వామితో ఉంటుంది.

G

Hyderabad | Published On Jun 6, 2026, 7.29 am IST

Indian Grey Hornbill | విశిష్ట అతిథి హార్న్‌బిల్.. జీవితాంతం ఒకే భాగ‌స్వామితో..
Advertisement

Indian Grey Hornbill | త్రినేత్ర‌.న్యూస్‌: ఈ ప‌క్షిపేరు హార్న్ బిల్‌. దీనిని ఇండియ‌న్ గ్రే హార్న్ బిల్ (Indian Grey Hornbill) అని కూడా పిలుస్తారు. ఇది జీవితాంతం ఒకే భాగ‌స్వామితో ఉంటుంది. ఏక‌ప‌త్నీ వ‌త్రాన్ని పాటిచే ఈ ప‌క్షులు హైదరాబాద్‌తోపాటు భార‌త ఉప‌ఖండం అంత‌టా క‌నిపిస్తాయి. మూడు నుంచి నాలుగు నెలలు ఇవి మన నగరానికి అతిథులుగా వ‌స్తాయి.

సుమారు 61 మీట‌ర్ల పొడ‌వు ఉంటే ఈ ప‌క్షి చెట్ల‌కు రంధ్రం చేసి గుడ్ల‌ను పొదిగేందుకు తాను లోప‌లే ఉండి.. మ‌ట్టి, పండ్ల గుజ్జుతో గూడును మూసేస్తుంది. పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు మ‌గ ప‌క్షే చిన్న రంధ్రం ద్వారా దానికి ఆహారం అందిస్తుంది. గుడ్లు పొదిగి పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబం అంతా కలిసి ఎగిరిపోతాయి. ఈ ప‌క్ష‌ల భాగ‌స్వామి మ‌ర‌ణిస్తే మ‌ళ్లీ మ‌రొక‌దానితో జ‌త‌క‌ట్ట‌వు.

ఎండిపోయిన చెట్లే ఆవాసాలు..

ఈ జాతి పక్షులు జంటగానే ప్రయాణిస్తాయి. జంటగానే కలిసి ఉంటాయి. ఎండిపోయిన పొడవాటి చెట్లు, ఎండిపోయిన మైదానాలు, అడవి ప్రాంతాలు వీటి ఆవాసాలు. ఏటా హైదరాబాద్ (Hyderabad) చుట్టు పక్కల ప్రాంతాలకు ఇవి వలస వస్తుంటాయి. తిరిగి వర్షాలు పడే సమయానికి నగరం వీడి వెళ్లిపోతాయి. సాధార‌ణంగా ఫిబ్రవరి నుంచి మే వరకు హైదరాబాద్‌లో కనిపిస్తాయి. అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ, చిలుకూరు జింకల పార్కు, పీరంచెరువు వంటి పెద్ద చెరువులు వద్ద కనిపిస్తాయి. కానీ శుక్ర‌వారం ఈ ప‌క్షి నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్‌లో క‌నిపించింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement