Bangladeshi Nationals Arrested | హైదరాబాద్‌లో అక్రమ నివాసం.. బంగ్లాదేశీయుల అరెస్ట్
Bangladeshi Nationals Arrested | జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ప్రాంతంలో ఉన్న ఓ అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు.
Bangladeshi Nationals Arrested | త్రినేత్ర.న్యూస్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ప్రాంతంలో ఉన్న ఓ అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. జీడిమెట్ల పీఎస్ ఎస్‌హెచ్‌వో తన బృందంతో కలిసి సోదాలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఆదేశాలతో విశ్వసనీయ సమాచారం మేరకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది హెచ్ఏఎల్ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఏడుగురు బంగాదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా భారతదేశంలో ఉండేందుకు అనుమతించే పాస్‌పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని తేలింది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు తేల్చారు. వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ సంబంధిత అధికారులు అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి వారిని బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌వోటీ కూకట్‌పల్లి జోన్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సేకు కలిసిరాని లక్ - లెనిన్ మూడోసారి వాయిదా?
- ●Kavitha | నిందితుడికి ఉరిశిక్ష విధించాలి : కల్వకుంట్ల కవిత
- ●Heavy Rains | బీ అలర్ట్.. మరికాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం..!
- ●LIC | ఎల్ఐసీలో ఈ పథకంలో చేరండి.. రిటైర్ అయ్యాక నెలకు రూ.21వేలు పెన్షన్ వస్తుంది..
- ●Peto's Paradox | ఏనుగులు, తిమింగలాలకు క్యాన్సర్ ఎందుకు రాదంటే.. సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తున్న జన్యు రహస్యాలివే!
- ●Maheshkumar Goud | మీనాక్షిని బలి చేశారు

Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సేకు కలిసిరాని లక్ - లెనిన్ మూడోసారి వాయిదా?

Kavitha | నిందితుడికి ఉరిశిక్ష విధించాలి : కల్వకుంట్ల కవిత

Heavy Rains | బీ అలర్ట్.. మరికాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం..!

LIC | ఎల్ఐసీలో ఈ పథకంలో చేరండి.. రిటైర్ అయ్యాక నెలకు రూ.21వేలు పెన్షన్ వస్తుంది..



