త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Traffic | చిన్నారులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం.. వెల్ల‌డించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

Hyderabad Traffic | హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టిన సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడంతో పాటు పోలీసు ప్రజల మధ్య సమీపాన్ని పెంచే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

P

Hyderabad | Published On May 2, 2026, 9.30 pm IST

Hyderabad Traffic | చిన్నారులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం.. వెల్ల‌డించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..
Advertisement

Hyderabad Traffic | హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టిన సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడంతో పాటు పోలీసు ప్రజల మధ్య సమీపాన్ని పెంచే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని (Free Summer Camp) నిర్వహించనున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) డీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ శిబిరం మే 11 నుంచి 16 వ‌ర‌కు.. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది.

కార్యక్రమంలో చిన్నారులకు ట్రాఫిక్ అవగాహన, రోడ్డు భద్రతపై శిక్షణతో పాటు ఆత్మరక్షణ, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, కార్టూనింగ్, చేతిరాత మెరుగుదల, వ్యక్తిత్వ వికాసం, ప్రాథమిక అత్యవసర వైద్య సహాయం వంటి అంశాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 6వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలు ఈ శిబిరానికి అర్హుల‌ర‌న్నారు. రిజిస్ట్రేష‌న్ మే 3 నుంచి మొద‌ల‌వుతుంద‌ని చెప్పారు. సీట్లు పరిమితంగా ఉన్నాయ‌న్నారు. వివ‌రాల‌కు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్ జీ హరీశ్‌ (8712660655), కార్యాలయ అసిస్టెంట్ (9848063345)ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. శిబిరానికి హాజరయ్యే చిన్నారులకు రవాణా సౌకర్యాన్ని తల్లిదండ్రులే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement