KBR Park | 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..
KBR Park | హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణ పనులు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 18 నుంచి వన్ వే ట్రాఫిక్ (One way) విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో వన్-వే ట్రాఫిక్ నిబంధనల అమలుపై కేబీఆర్ పార్క్ వాకర్లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్చించారు.
KBR Park | త్రినేత్ర.న్యూస్: హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ (KBR Park) చుట్టూ పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణ పనులు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ (One way) విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో వన్-వే ట్రాఫిక్ నిబంధనల అమలుపై కేబీఆర్ పార్క్ వాకర్లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్చించారు. కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ కాజల్.. వాకర్లకు ట్రాఫిక్ మార్పుల గురించి వివరించారు. కొత్త విధానం సులభంగా, క్రమబద్ధంగా అమలయ్యేందుకు పార్క్ సందర్శకులు, వాహనదారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
అదేవిధంగా వాకర్లకు పలు సూచనలు చేశారు. వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో (Parking Bays), మల్టీ-లెవల్ పార్కింగ్ సదుపాయంలో మాత్రమే నిలపాలన్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో రోడ్డుకు ఎదురుగా (రాంగ్ రూట్‌లో) వాహనాలు నడపకూడదని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన సవరించిన నిబంధనలు, సూచనలను తప్పక పాటించాలని, వన్-వే ట్రాఫిక్ విధానాన్ని విజయవంతం చేసేందుకు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
నూతన ట్రాఫిక్ నిబంధనలపై కేబీఆర్ పార్క్ వాకర్ల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు పార్క్ ముందు QR కోడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ రాకపోకలు సురక్షితంగా, వేగవంతంగా జరిగేందుకు పౌరులు, ముఖ్యంగా నిత్యం కేబీఆర్ పార్క్‌కు వచ్చే సందర్శకులు సహకరించాలన్నారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే.. రైట్ టర్న్ బంద్
హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా KBR పార్క్ చుట్టూ పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణ పనులు జరగనున్నాయి. ఈ పనుల కారణంగా ఆగస్టు 18 నుంచి ఆ పార్క్ చుట్టూ కొత్త వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు. భారీ నిర్మాణ పనులు ఉన్నందున ఈ వన్-వే రూల్స్ సుమారు ఏడాదిన్నర పాటు (1.5 years) అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఏ రోడ్డులోనూ కుడి వైపునకు తిరగడం (Right turn) పూర్తిగా నిషేధం.
ప్రయాణికులు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు లేన్ మారడానికి 10 లేన్ చేంజర్లు, 13 ఎగ్జిట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు ఇవే.
పంజాగుట్ట టు కేబుల్ బ్రిడ్జి: రైట్ టర్న్ తీసుకోకూడదు. ఎన్టీఆర్ భవన్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుని, తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద లేన్ మార్చుకుని, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్, ఫీనిక్స్ బిల్డింగ్ మీదుగా కేబుల్ బ్రిడ్జి చేరుకోవాలి.
యూసుఫ్‌గూడ/శ్రీనగర్ కాలనీ టు మాదాపూర్: ఇందిరానగర్ గడ్డ రోడ్ లేదా వెంకటగిరి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకుని, రోడ్ నెం. 10 (డైమండ్ హౌస్, అల్కాజర్) వద్ద మళ్లీ కుడివైపు తిరిగి రోడ్ నెం. 36 మీదుగా మాదాపూర్ వెళ్లాలి.
కేబుల్ బ్రిడ్జి టు రోడ్ నెం.12: రోడ్ నెం. 45 జంక్షన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని, వెంటనే కుడి లేన్‌లోకి మారాలి. జూబ్లీ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా వెళ్లి బీఆర్ఎస్ భవన్ వద్ద లేన్ మారి రోడ్ నెం. 12 వైపు వెళ్లాలి.
సంబంధిత వార్తలు

Para Cricketer | రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం.. పారా క్రికెటర్‌కు ఆహ్వానం
ఆగస్టు 14, 2026

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో మార్కెట్లకు మళ్లీ షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..
ఆగస్టు 14, 2026

Bomb Blast | రైల్వే స్టేషన్లో పేలుళ్లు.. 35 ఏండ్ల తర్వాత టెర్రరిస్టు అరెస్ట్
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Para Cricketer | రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం.. పారా క్రికెటర్‌కు ఆహ్వానం
- ●Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో మార్కెట్లకు మళ్లీ షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..
- ●Bomb Blast | రైల్వే స్టేషన్లో పేలుళ్లు.. 35 ఏండ్ల తర్వాత టెర్రరిస్టు అరెస్ట్
- ●GATE 2027 Reschedule | మారిన షెడ్యూల్.. గేట్ 2027 రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే?
- ●Hyderabad | డెలివరి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. యువకుడి దారుణ హత్య
- ●Tunnel Collapse | ఉత్తరాఖండ్‌లో సొరంగ ప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం

Para Cricketer | రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం.. పారా క్రికెటర్‌కు ఆహ్వానం

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో మార్కెట్లకు మళ్లీ షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Bomb Blast | రైల్వే స్టేషన్లో పేలుళ్లు.. 35 ఏండ్ల తర్వాత టెర్రరిస్టు అరెస్ట్

GATE 2027 Reschedule | మారిన షెడ్యూల్.. గేట్ 2027 రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే?



